Mynampally Hanumantha Rao : బీఆర్ఎస్ కు మైనంపల్లి గుడ్ బై
భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే ఛాన్స్
Mynampally Hanumantha Rao : బీఆర్ఎస్ కు కోలుకోలేని షాక్ తగిలింది. ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సాక్షిగా తన కొడుకు టికెట్ రాకుండా చేశాడంటూ మండిపడ్డారు.
అంతే కాదు ఒకనాడు లబ్బరు స్లిప్పర్లతో తిరిగిన నీవు ఇప్పుడు లక్ష కోట్లు ఎలా సంపాదించావో ప్రజలకు చెప్పాలన్నారు. ఇదే సమయంలో తాను పార్టీపై ఆరోపణలు చేయలేదని , కేవలం హరీశ్ రావు మీద మాత్రమే కామెంట్స్ చేశానని స్పష్టం చేశారు.
Mynampally Hanumantha Rao Will Resign BRS
ఆయన చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ లో కలకలం రేపాయి. మైనంపల్లి హనుమంత రావు(Mynampally Hanumantha Rao) గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మెదక్ జిల్లా పార్టీ చీఫ్ గా పని చేశారు. ఆ తర్వాత కేసీఆర్ సారథ్యంలో గులాబీ కండువా కప్పుకున్నారు.
ఇవాళ బీఆర్ఎస్ పార్టీని వీడనున్నారు. రాజీనామా చేయనున్నారు. తన ముఖ్య కార్యకర్తలతో సమావేశమై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు సంచలన ప్రకటన చేసే ఛాన్స్ ఉంది.
ఈ సందర్భంగా గతంలో టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డిపై మైనంపల్లి హనుమంత రావు చేసిన సంచలన ఆరోపణలతో కూడిన ఆడియో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా ఇందులో రేవంత్ రెడ్డిని తొక్కుతానంటూ మండిపడ్డారు.
అంతే కాదు తాను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ , ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లాంటి వాళ్లకు భయపడను అంటూ హెచ్చరించారు. నేను తల్చుకుంటే ఎవరినైనా మర్డర్ చేస్తానంటూ చెప్పారు. తాను సమైక్యాంధ్రకు సపోర్ట్ చేశానంటూ తెలిపారు.
Also Read : Chandrababu Naidu : జగన్ రూ. 40 వేల కోట్ల దోపిడీ
