Chandrababu Naidu : ప్రాజెక్టుల పేరుతో నిలువు దోపిడీ
జగన్ రెడ్డిపై చంద్రబాబు ఆగ్రహం
Chandrababu Naidu : టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. కడప జిల్లా ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జగన్ నిలువు దోపిడీకి ప్లాన్ చేశాడని మండిపడ్డారు. ఇప్పటి వరకు నాలుగేళ్ల పాలనలో ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల ఊసెత్తడం లేదని, వాటి నిర్మాణం గాలికి వదిలి వేశాడంటూ ధ్వజమెత్తారు.
Chandrababu Naidu Presentation
మరో కొత్త దోపిడీకి తెర లేపాడాని ఫైర్ అయ్యారు. కొత్తగా 10 ప్రాజెక్టుల పేరుతో రూ. 12 వేల కోట్ల దోపిడీకి సిద్దమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు. గండిపేట- చిత్రావతి, గండికోట – పైడిపాలెం ప్రాజెక్టులను పరిగణలోకి తీసుకోవడం లేదన్నారు. రూ. 5,036 కోట్లతో పనులు మంజూరు చేసినా గుత్తేదారులకు బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ధ్వజమెత్తారు.
కేవలం 10 శాతం పెండింగ్ లో ఉన్న హంద్రీ నీవా కాలువ పనులు పూర్తి చేయలేదని ఎందుకోసమని ప్రశ్నించారు. ఉన్న ప్రాజెక్టులను రద్దు చేసి నాటకాలు ఆడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. రాయలసీమ నివారణ పథకం పేరుతో డ్రామాలు ఆడుతున్నారంటూ నిప్పులు చెరిగారు చంద్రబాబు నాయుడు. కేఆర్ఎంబీ, ఎన్జీటీ, సీడబ్ల్యూసీ అనుమతులు ఇంకా రాలేదన్నారు. పోలవరం కాఫర్ డ్యామ్ లు 80 శాతం పూర్తి చేశామని , గైడ్ బండ్ నిర్లక్ష్యం చేశారన్నారు. తెలుగుగంగకు నీరు ఇస్తామన్న హామీని మరిచారంటూ ధ్వజమెత్తారు. రివర్స్ నిర్ణయాలతో కడప జిల్లాలో 14 ప్రాజెక్టులు ప్రీ క్లోజర్ అయ్యాయని అన్నారు.
Also Read : G Kishan Reddy : ఎస్సీ, ఎస్టీ నిధుల దుర్వినియోగం