Chandrayan-3 Comment : నీలి మేఘమా ‘చందమామ’
కోట్లాది కలలన్నీ చంద్రాయన్ -3 పైనే
Chandrayan-3 Comment : పిల్లలు మారామూ చేసినా , ప్రియురాలు దగ్గరలో లేక పోయినా ముందుగా గుర్తుకు వచ్చేది చందమామనే. చంద్రుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో కథలు, మరెన్నో విశేషాలు. కొందరికే పరిమితమైన ఈ ప్రయత్నం ఇవాళ సాక్షాత్కారం చేసిన ఘనత మానవుడిదే. అంతరిక్షం అంతులేని సంపదత్వంగా పేరు పొందింది. భూమి నుంచి నింగిలోకి ఎగరడం అన్నది ఓ కల. దానిని సాకారం చేసింది రైట్ బ్రదర్స్. అక్కడి నుంచి మొదలైన ప్రయాణం ఎన్నో మార్పులకు లోనైంది. లెక్కలేనన్ని ఆవిష్కరణలు చోటు చేసుకున్నాయి. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
రష్యా, అమెరికా, చైనాతో పాటు భారత్ కూడా స్పేస్ లో తనకంటూ ఓ స్పేస్ ను స్వంతం చేసుకుంది. ఇది భారతదేశ ఖగోళ శాస్త్ర రంగంలో మైలు రాయిగా చెప్పవచ్చు. ప్రస్తుతం చంద్రయాన్ -3(Chandrayan-3) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వుంది. దీనికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు దీని కోసం. ఏ దేశం చేయని ప్రయత్నం ప్రస్తుతం భారత్ చేస్తుండడం విశేషం. కోట్లాది కళ్లన్నీ ప్రయోగంపై ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. దానికి బాహుబలి ఉపగ్రహం అంటూ పేరు పెట్టారు. ఎస్ఎస్ రాజమౌళి ఏ ముహూర్తంలో సినిమా తీశాడో కానీ దేశంలో ఇది ఓ ఊత పదంగా మారింది.
చంద్రుని వద్దకు పంపుత్తున్న ఉపగ్రహం చంద్రయాన్ మూడవది. దీని బరువు 3,921 కిలో గ్రాములు. నాలుగు లక్షల కిలోమీటర్ల ప్రయాణం చేసేలా రూపొందించారు. శ్రీహరి కోట లోని ఇస్రో ఇందుకు సిద్దమైంది. భారత దేశ ప్రధాని కూడా వెన్నుతట్టి ప్రోత్సహించారు. బంగాళాఖాతం తీరంలో చందమామ వద్దకు చేరేందుకు వేచి ఉండడం ఉత్కంఠను రేపుతోంది. దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఏ దేశంపై ఆధార పడకుండా స్వదేశీ విజ్క్షానంతో తయారు చేసిన ఉపగ్రహం. ఒక రకంగా పెద్దన్న అమెరికా వెన్నులో ఒణుకు పుట్టేలా చేసింది ఈ ప్రయత్నం.
దీని టార్గెట్ ఒక్కటే..చంద్రుని దక్షిణ ధ్రువం వద్దకు చేరుకునేలా దీనిని తయారు చేశారు శాస్త్రవేత్తలు. ఇది గనుక సక్సెస్ అయితే రష్యా, అమెరికా, చైనా తర్వాత విజయవంతమైన నాలుగో దేశంగా చరిత్ర పుటల్లోకి ఎక్కుతుంది. ఇందుకు ప్రత్యేకంగా అభినందించాల్సింది ఇస్రో చైర్మన్ సోమనాథ్ ను. దీని ముఖ్య ఉద్దేశం చంద్రుని నేలపై పరిశోధన, ఉపరి తలం చుట్టూ తిరగడం, భూకంపాలను నమోదు చేయడం. చంద్రయాన్ -2(Chandrayan-2) సక్సెస్ కావాలని సమున్నత భారతం సగర్వంగా తల ఎత్తుకునేలా చేయాలని ..చేస్తుందని ఆశిద్దాం.
Also Read : TSRTC MD : శిక్షణతోనే సక్సెస్ సాధ్యం – సజ్జనార్