Brij Bhushan Sharan Singh : లేకి చేష్టలు చిల్లర బుద్దులు
ఎఫ్ఐఆర్ లో సంచలన నిజాలు
Brij Bhushan Sharan Singh : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లర్ల సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, భారతీయ జనతా పార్టీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఆయన వ్యక్తిగత ప్రవర్తన పూర్తిగా భిన్నంగా ఉందని సమాచారం. గత నెలలో ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో ఏడుగురు మహిళా రెజ్లర్లు ఫిర్యాదు చేశారు. వారి ఆరోపణల మేరకు ఎఫ్ఐఆర్ లో పొందు పర్చారు పోలీసులు.
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్(Brij Bhushan Sharan Singh) మహిళా అథ్లెట్లను వారి శ్వాసను తనిఖీ చేసే సాకుతో అనుచితంగా తాకారని, వారిని తరిమి కొట్టారని, తగతని వ్యక్తిగత ప్రశ్నలు అడిగారని వాపోయారు. చికిత్సకు అయ్యే ఖర్చును ఫెడరేషన్ భరిస్తుందని, అయితే తన లైంగిక వాంఛలు తీర్చాలని డిమాండ్ చేశాడని అథ్లెట్లు వాపోయారు. మైనర్ రొమ్ముపై చేతులతో రుద్దడం కూడా చేశాడని ఆరోపించారు.
అయితే మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. తాను ఎలాంటి చర్యలకు పాల్పడలేదని తెలిపాడు. వారు చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కదానిని నిరూపించినా వెంటనే తాను ఉరి వేసుకుంటానని ప్రకటించాడు. ఆధారాలను కోర్టుకు సమర్పించాలని కోరాడు. ఇదిలా ఉండగా అత్యంత అనుచితమైన, దారుణమైన రీతిలో బెదిరింపులకు పాల్పడ్డాడని, లైంగికంగా వేధించాడని సింగ్ పై మండిపడ్డారు బాధితులు. అంతే కాకుండా రెజ్లింగ్ ఫెడరేషన్ సెక్రటరీ వినోద్ తోమర్ కూడా తన ఢిల్లీ ఆఫీసులో బలవంతం చేశారంటూ మరో రెజ్లర్ ఆరోపించారు. మైనర్ బాలిక తండ్రి కూడా ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు.
Also Read : Bhatti Vikramarka