Charmy Kaur : కష్టపడినా ఫలితం దక్కలేదు
కొంప ముంచిన విజయ్ పొగరు
Charmy Kaur : డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా తీశాడు. ఇందులో విజయ్ దేవరకొండ, అనన్య పాండే, మైక్ టైసన్ , రమ్య కృష్ణ కీలక పాత్రల్లో నటించారు.
మూడేళ్ల పాటు కష్టపడి సినిమా తీశామని నిర్మాతలలో ఒక భాగంగా ఉన్న చార్మి కౌర్ తెలిపారు. ఆమె కంటతడి పెట్టారు. మొదటి రోజు బాగానే ఉందని టాక్ వచ్చినా ఎందుకనో చివరకు డిజాస్టర్ అని తేలింది.
సినిమాకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేపట్టారు. ఎక్కడికి వెళ్లినా ఆదరించారు. కానీ మూవీ మాత్రం బ్యాడ్ టాక్ తెచ్చుకుంది. విడుదలకు ముందు లైగర్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు చిత్ర యూనిట్.
ఎంత మంది స్టార్లున్నా సినిమాలో దమ్ము అనేది లేక పోతే నడవదని తేలి పోయింది. చివరకు లైగర్ పూర్తిగా ఎత్తి పోయింది. భారీ బడ్జెట్ తో ఈ మూవీ నిర్మాతలకు నష్టాల్ని మిగిల్చింది.
సినీ విశ్లేషకులు పెద్ద ఎత్తున లైగర్ ను ఏకి పారేశారు. తాజాగా ఈ సినిమా ఫెయిల్ కావడంపై వాపోయారు నటి, నిర్మాత ఛార్మి కౌర్(Charmy Kaur). ప్రస్తుతం జనాలు థియేటర్లకు వచ్చేందుకు ఇష్ట పడడం లేదు.
ఒక్క క్లిక్ తో సినిమాలు చూసే సౌకర్యం ఉన్నప్పుడు టాకీసులకు ఎందుకు వస్తారని ప్రశ్నించారు. ఒకానొక సమయంలో ఛార్మి కంటతడి పెట్టింది. ఇదిలా ఉండగా తెలుగులో తాజాగా విడుదలైన బింబిసార, సీతారామం, కార్తికేయ-2 వంటి సినమాలు బిగ్ హిట్ గా నిలిచాయి.
Also Read : కెనడా నగరంలో వీధికి రెహమాన్ పేరు