Chaturveda Havanam : ఘనంగా శ్రీనివాస చతుర్వేద హవనం
అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం
Chaturveda Havanam : లోక కళ్యాణం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనంలోని మైదానంలో గురువారం శాస్త్రోక్తంగా శ్రీశ్రీనివాస హవనం ప్రారంభమైంది. రుత్వికులు కలశ స్థాపన, కలశ ఆవాహన, తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. యజమాని సంకల్పం, భక్త సంకల్పం, గణపతి పూజ, అగ్ని ప్రతిష్ట కార్యక్రమాలు చేపట్టారు. ఈ హవన ఉత్సవ కార్యక్రమంలో 32 మంది రుత్వికులు నాలుగు వేదాల్లోని మంత్రాలను పఠిస్తూ హవనం చేశారు. వేద మంత్రాలతో టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలోని మైదానం పూర్తిగా మారమ్రోగి పోయింది. మధ్యాహ్నం 1 గంట వరకు జరిగింది.
ఈ ప్రత్యేక హవనం కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఏవీ ధర్మారెడ్డి దంపతులు, జేఈవో సదా భార్గవి దంతపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ(TTD) ఈవో మీడియాతో మాట్లాడారు. లోక కళ్యాణం కోసం వారం రోజుల పాటు తిరుపతిలో తొలిసారిగా శ్రీ శ్రీనివాస చతుర్వేద హవనం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జూలై 5వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతుందన్నారు.
32 మంది రుత్వికులు హోమ కార్యక్రమాన్ని ఏడు రోజుల పాటు చేపడతారని తెలిపారు. సృష్టి లోని సకల జీవరాశులు ఆరోగ్యంగా, ఆనందంగా, శుభంగా ఉండాలని స్వామి వారిని ప్రార్థిస్తారని చెప్పారు. ఉదయం 8 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమ జరుగుతుందని వెల్లడించారు ఈవో. సాయంత్రం ఆధ్యాత్మిక ప్రవచనాలు , భక్తి సంగీత కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.
Also Read : Arvind Kejriwal LG : ఎల్జీ కామెంట్స్ కేజ్రీవాల్ సీరియస్