Arvind Kejriwal LG : ఎల్జీ కామెంట్స్ కేజ్రీవాల్ సీరియస్
ఢిల్లీ ప్రజలను చులకన చేస్తే ఎలా
Arvind Kejriwal LG : ఢిల్లీ ప్రజలను చులకన చేసి మాట్లాడిన లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాపై నిప్పులు చెరిగారు ఆప్ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఇది మంచి పద్దతి కాదని సూచించారు. మీరు బయటి నుంచి వచ్చారు. ఇక్కడి ప్రజల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదంటూ స్పష్టం చేశారు సీఎం. ఢిల్లీ వాసులు నిత్యం కష్డపడాతారు. వారు పది మందికి సహాయం చేస్తారు. గత కొన్ని తరాల నుండి ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది.
ఈ నగరం ఎందరికో నీడను ఇచ్చింది. మరికొందరికి బతుకునిచ్చింది. ఇక్కడ అన్ని కులాలు, మతాలకు చెందిన వారు జీవిస్తున్నారు. ఆ మాత్రం తెలుసుకోకుండా ఢిల్లీ వాసుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). ఎంతో కష్టపడి ఢిల్లీని సుందరంగా తీర్చిదిద్దారు. ఎల్జీ పదవిలో ఉండి కూడా ఇలా ఒక ప్రాంతాన్ని, ప్రజలను చులకన చేయడం ఎంత వరకు న్యాయమని నిలదీశారు అరవింద్ కేజ్రీవాల్.
ఇలా ఇంకెప్పుడూ ఢిల్లీ వాసులను అవమానానికి గురి చేసేలా కామెంట్స్ చేయొద్దంటూ సూచించారు . అంతే కాదు ఢిల్లీ ప్రభుత్వ ఇతర ప్రభుత్వాల లాగా చోరీకి పాల్పడదు. వచ్చిన దాంట్లోంచి మిగిలిన వాటిని సంక్షేమం కోసం, ఢిల్లీ నగర అభివృద్ది కోసం, పేదల కోసం ఖర్చు చేస్తుందని స్పష్టం చేశారు అరవింద్ కేజ్రీవాల్.
Also Read : Eid Mubarak : స్నేహానికి చిరునామా త్యాగం
