Chelannur Hindi : హిందీ అక్షరాస్యతా గ్రామంగా చెలన్నూరు
కేరళ రాష్ట్రంలో గ్రామం తీర్మానం సంచలనం
Chelannur Hindi : కేంద్ర ప్రభుత్వం ఓ వైపు హిందీని దేశ వ్యాప్తంగా అధికార భాషగా ప్రకటించాలని చేస్తుండగా మరో వైపు పలు రాష్ట్రాలు తప్పు పడుతున్నాయి. ఈ తరుణంలో కేరళలో కొలువు తీరిన కమ్యూనిస్టు ప్రభుత్వంలో ఓ గ్రామం ఏకంగా 100 శాతం హిందీలో అక్షరాస్యతను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇది ఒక రకంగా చెప్పాలంటే సంచలన నిర్ణయమని చెప్పక తప్పదు. ఇప్పటికే దేశంలో వంద శాతం అక్షరాస్యత కలిగి ఉన్న రాష్ట్రంగా కేరళ పేరొందింది. తాజాగా కేరళలలోని చల్లనూరు గ్రామ పంచాయతీ మాత్రం అందుకు భిన్నంగా హిందీని(Chelannur Hindi) కోరుకుంటోంది. అక్కడి గ్రామస్థులంతా పూర్తిగా హిందీలో పర్ ఫెక్ట్ గా మాట్లాడాలని తీర్మానం చేసుకున్నారు.
వచ్చే ఏడాదికల్లా చల్లనూరు వంద శాతం పూర్తి చేయాలని కంకణం కట్టుకుంది. ఇక్కడ వలస కార్మికులు ఎక్కువగా ఉన్నారు. 72 ఏళ్ల జానకి అమ్మ చిన్న కేరళ గ్రామంలో హిందీపై తనకు ఉన్న ప్రేమను వ్యక్తం చేసింది. ఓ వైపు హిందీ ప్రయోగ ప్రయత్నాలను తమిళనాడుతో పాటు కేరళ కూడా వ్యతిరేకిస్తున్న తరుణంలో చల్లనూరు హిందీ కోసం ముందుకు రావడం విశేషం.
ఇదిలా ఉండగా గ్రామంలోని గణనీయమైన వలస కార్మికులు ఉండడం హిందీని నేర్చుకునేందుకు ముందుకు వచ్చినట్లు అర్థం అవుతోంది. వచ్చే ఏడాది రిపబ్లిక్ డే నాటికి చెలన్నూర్ ను పూర్తి హిందీ అక్షరాస్యతా పంచాయతీగా ప్రకటించనుంది కేంద్రం. ఈ పల్లె ఓ చరిత్ర సృష్టించడం ఖాయం.
Also Read : అంతర్జాతీయ ఆయుర్వేద దినోత్సవం