Ayurveda Day : అంత‌ర్జాతీయ ఆయుర్వేద దినోత్స‌వం

హ‌ర్ దిన్ హ‌ర్ ఘ‌ర్ ఆయుర్వేదం థీమ్

Ayurveda Day : ఆయుర్వేద అంత‌ర్జాతీయ దినోత్స‌వం జ‌రుపుకుంటోంది యావ‌త్ ప్ర‌పంచం. ప్ర‌తి ఏటా అక్టోబ‌ర్ 23న నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. ఆయుర్వేదం భార‌త దేశంలో ఎక్కువ‌గా ప్రాచుర్యం పొందుతోంది. దేశంలో 2014లో కొలువు తీరిన మోదీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ఆయుర్వేదంను అభివృద్ది చేసేందుకు, ప్రాచుర్యంలోకి తీసుకు వ‌చ్చేందుకు మ‌ద్ద‌తు ఇస్తూ వ‌స్తోంది కేంద్ర స‌ర్కార్. ఇందులో భాగంగా ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఆయుర్వేదాన్ని ప్ర‌మోట్ చేస్తూ వ‌స్తోంది. ఇందుకు సంబంధించి వ్యాధుల ముంద‌స్తు నివార‌ణ‌, దృఢ‌మైన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మెరుగైన జీవ‌న నాణ్య‌త‌ను పెంపొందించేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది.

ఇదిలా ఉండ‌గా జాతీయ ఆయుర్వ‌దే దినోత్సవాన్ని(Ayurveda Day) 2016 నుండి ప్ర‌తి ఏటా జ‌రుపుకుంటూ వ‌స్తోంది. ధ‌న్వంతి పూజ‌న్ రోజున జ‌రుపుకుంటారు. ఆయుర్వేదం భార‌తీయ గ్రంథాల‌లో లోతుగా పాతుకు పోయింది. ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న శైలిని గ‌డిపేందుకు స‌హ‌జ వ‌న‌రుల‌ను ఉప‌యోగించ‌డంపై దృష్టి పెట్టింది.

ఇందులో భాగంగా కీల‌క నిర్ణ‌యాలు ప్ర‌క‌టించింది మోదీ ప్ర‌భుత్వం. ఆరోగ్య‌క‌ర‌మైన దేశం కోసం హ‌ర్ దిన్ హ‌ర్ ఘ‌ర్ ఆయుర్వేదంగా ప్ర‌క‌టించింది. మూలిక‌లు, మొక్క‌లు, నూనెలు, సుగంధ ద్ర‌వ్యాలు వంటి స‌హ‌జ వ‌న‌రుల‌ను ఉప‌యోగించు కోవాలి. ప‌లు రోగాల‌కు ఆయుర్వేదం చికిత్స కార‌కంగా ప‌ని చేస్తోంది. బీజేపీ స‌ర్కార్ విస్తృతంగా ప్ర‌చారం చేస్తోంది.

యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమ‌న్ స‌ర్వీసెస్ ఆయుర్వేదానికి మ‌ద్ద‌తు ఇచ్చే కొన్ని క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ న‌డుపుతోంది. మొత్తంగా ఆయుర్వేదంను జీవ‌న యోగంగా మార్చాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంది.

Also Read : పరగడుపున వెల్లుల్లి తీసుకుంటే కలిగే లాభాలు..

Leave A Reply

Your Email Id will not be published!