YS Sharmila : అన్న కాదు నాన్న నా రోల్ మోడ‌ల్

వైఎస్ ష‌ర్మిల షాకింగ్ కామెంట్స్

YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల(YS Sharmila) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రోల్ మోడ‌ల్ కాద‌ని దివంగ‌త సీఎం, త‌న తండ్రి సందింటి రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌న‌కు రోల్ మోడ‌ల్ అంటూ స్ప‌ష్టం చేశారు. 2024లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తాను పాలేరు నుంచి పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు వైఎస్ ష‌ర్మిల‌.

ప‌నిలో ప‌నిగా మునుగోడు ఉప ఎన్నిక‌లో ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై ముంద‌స్తు జోష్యం చెప్పారు. అక్క‌డ గెలిచేది భార‌తీయ జ‌న‌తా పార్టీ అభ్య‌ర్థి రాజ‌గోపాల్ రెడ్డి కాద‌ని గెలిచేది కూచుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి గెలుస్తాడ‌ని అన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని ఆరోపించారు.

అయితే ఇక్క‌డ టీఆర్ఎస్ గెల‌వడం ఖాయ‌మ‌న్నారు. ఇదిలా ఉండ‌గా ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే ద‌మ్ము సీఎం కేసీఆర్ కు లేద‌ని తేల్చి చెప్పారు. ప్ర‌స్తుతం అన్ని పార్టీలు ఒక్క‌టేన‌ని ప్ర‌జ‌ల‌కు మాయ మాట‌లు చెబుతూ కాలం వెళ్ల దీస్తున్నార‌ని ఆరోపించారు. మునుగోడులో తాము ఏ పార్టీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేద‌ని ప్ర‌క‌టించారు వైఎస్ ష‌ర్మిల‌.

మునుగోడుకు ఉప ఎన్నిక ప్ర‌జ‌లు కోరుకున్న‌ది కాద‌ని కొంత మంది స్వార్థ ప‌రుల వ‌ల్ల‌నే వ‌చ్చింద‌న్నారు. త‌న‌కు మెగా కృష్ణా రెడ్డి నుంచి రూ. 1,000 కోట్లు ఆఫర్ వ‌చ్చిందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అయితే ఏపీలో పోల‌వ‌రం ప్రాజెక్టు ను కూడా మెగా నిర్మిస్తోంది. కానీ దానిపై మాత్రం మేడం దాట‌వేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

Also Read : జ‌న‌సేన‌తో స్నేహం టీడీపీతో పొత్తు పెట్టుకోం

Leave A Reply

Your Email Id will not be published!