#Garlic : పరగడుపున వెల్లుల్లి తీసుకుంటే కలిగే లాభాలు..

వెల్లుల్లి వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

Garlic : వెల్లుల్లి వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వెల్లుల్లి వాసన చాలా ఘాటుగా ఉంటుంది. దీనిని కూరల్లో వేసుకుంటే ప్రత్యేక రుచిని కలిగిస్తాయి. వెల్లుల్లిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ శరీరంలో ఉండే విషపదార్ధాలను తరిమికొడతాయి. పరగడుపున వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలను తరిమి కొట్టవచ్చు.

జ్వరం, ఉబ్బసం, కాలేయ సమస్యలకు కూడా వెల్లుల్లి తీసుకోవడం మంచిది. వెల్లుల్లి బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. ఫలితంగా మధుమేహం తగ్గుతుంది. వెల్లుల్లి రెబ్బలు తీసుకోవడం వల్ల శ్వాస కోశ సమస్యలను తగ్గించి శ్వాస బాగా ఆడేలా చేస్తుంది. వెల్లుల్లి మతిమరపుకి దారితీసే అల్జీమర్స్ వ్యాధి రాకుండా చేస్తుంది. అంతేకాదు బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది.

వెల్లుల్లిలో వాపును తగ్గించే గుణం ఉంది. వాపు వచ్చిన ప్రదేశాన వెల్లుల్లి రసాన్ని మర్ధన చేయటం వల్ల ఆ భాగంలో వాపులు, నొప్పులు తగ్గిపోతాయి. ఉదయాన్నే వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల అధిక కొవ్వును కరిగించి బరువు తగ్గేలా చేస్తాయి. విన్నారుగా వెల్లుల్లి రెబ్బలు నిత్యం తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజలు. మంచిది కదా అని ఎక్కువ కూడా తీసుకోకూడదు. రోజుకు మూడు నాలుగు రెబ్బలు తీసుకుంటే చాలు.

No comment allowed please