#TTD :‌ శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి ర‌ద్దుచేసిన టిటిడి

TTD has cancelled the conduct of Sri Ramakrishna Theertha Mukkoti

TTD : తిరుమ‌ల‌లో జ‌న‌వ‌రి 28వ తేదీన జ‌ర‌గాల్సిన శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి కార్య‌క్ర‌మాన్ని ర‌ద్దు చేసిన‌ట్టు టిటిడి ప్ర‌క‌టించింది. ఈ ప‌ర్వ‌దినం నాడు ఎక్కువ మంది భ‌క్తులు విచ్చేసి ఈ తీర్థంలో స్నానాలు చేసే సంప్ర‌దాయం ఉన్నందువ‌ల్ల, భ‌క్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ముక్కోటి పూజా కార్య‌క్ర‌మాల‌ను టిటిడి ర‌ద్దు చేసింది. ఈ కార‌ణంగా రామ‌కృష్ణ తీర్థంలోకి భ‌క్తుల‌కు అనుమ‌తి లేద‌ని టిటిడి స్ప‌ష్టం చేసింది. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణ‌యం తీసుకుంది.

 

No comment allowed please