CSK vs MI IPL 2022 : ఉత్కంఠ పోరులో చెన్నై సెన్సేష‌న్

ఫినిషింగ్ ట‌చ్ ఇచ్చిన డైన‌మెట్

CSK vs MI  : ఐపీఎల్ 2022 రిచ్ టోర్నీలో భాగంగా జ‌రిగిన మెగా టోర్నీలో ఊహించ‌ని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆఖ‌రు వ‌ర‌కు నువ్వా నేనా అన్న రీతిలో ఆట సాగింది. ఎప్ప‌టి లాగే త‌న‌లో స‌త్తా త‌గ్గ‌లేద‌ని నిరూపించాడు మాజీ సీఎస్కే (CSK vs MI )కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ.

20 ఓవ‌ర్ లో 17 ప‌రుగుల్ని చేసి త‌న జ‌ట్టుకు రెండో విజ‌యాన్ని అందించాడు. ఇంకా ప్లే ఆఫ్స్ ఆశ‌లు ఉంచేలా చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. సీఎస్కే స్కిప్ప‌ర్ ర‌వీంద్ర జ‌డేజా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

ముంబై ఇండియ‌న్స్ ఆది లోనే త‌డ‌బ‌డింది. ల‌క్ష్యం చిన్న స్కోరే అయిన‌ప్ప‌టికీ చివ‌రి దాకా మ్యాచ్ ఉత్కంఠ భ‌రితంగా సాగింది. ధోనీ త‌న‌దైన శైలిలో మ్యాచ్ ను ముగించాడు. వ‌రుస‌గా ఒక సిక్స్ , రెండు ఫోర్లు కొట్టి జట్టును ఒడ్డుకు చేర్చాడు.

156 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగింది సీఎస్కే(CSK vs MI ). ఆదిలోనే వికెట్లు కోల్పోయినా ఆ వెంట‌నే ఉత‌ప్ప‌, రాయుడు చ‌క్క దిద్దారు. రాయుడు 40 ప‌రుగులు చేస్తే ఉత‌ప్ప 30 ర‌న్స్ చేసి రాణించారు.

ఆఖ‌రులో వ‌చ్చిన ధోనీ 28 ప‌రుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. ఇక ముంబై బౌల‌ర్ల‌లో డానియ‌ల్ సామ్స్ నాలుగు వికెట్లు తీస్తే జ‌య‌దేవ్ ఉనాద్క‌త్ రెండు వికెట్లు, మెరిడిత్ ఒక వికెట్ తీశాడు.

ఇక అంత‌కు ముందు బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ ప్రారంభంలోనే 23 ర‌న్స్ కే మూడు వికెట్లు కోల్పోయింది. తిల‌క్ వ‌ర్మ , సూర్య కుమార్ యాద‌వ్ ఆదుకున్నారు.

వ‌ర్మ 51 ప‌రుగులు చేస్తే సూర్య 32 ర‌న్స్ చేయ‌డంతో ఆ మాత్రం స్కోర్ సాధించింది. దీంతో ముంబై ఇండియ‌న్స్ ప‌రాజ‌యం ప‌రిస‌మాప్తం అయ్యింది. వ‌రుస‌గా ఆ జ‌ట్టుకు ఇది ఏడో ఓట‌మి.

Also Read : విజ్డెన్ ఐదుగురు క్రికెట‌ర్ల‌లో రోహిత్..బుమ్రా

Leave A Reply

Your Email Id will not be published!