CSK Record : 13 ఏళ్ల తర్వాత చెన్నై చమక్
ముంబై ఇండియన్స్ పై విక్టరీ
CSK Record : ఐపీఎల్ 16వ సీజన్ లో ధోనీ సేన గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. లీగ్ మ్యాచ్ లో భాగంగా ముంబై ఇండియన్స్ తో చెన్నై లోని చెపాక్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగింది. విచిత్రం ఏమిటంటే 13 ఏళ్ల తర్వాత ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్(CSK Record) విజయం సాధించడం. ఇది ఓ రికార్డు అని చెప్పక తప్పదు.
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టైటిళ్లను గెలుపొందిన జట్లుగా ఇప్పటికీ ముంబై ఇండియన్స్ , చెన్నై సూపర్ కింగ్స్ మీదే ఉన్నాయి. ఇప్పటి వరకు చెన్నై, ముంబైతో పాటు రాజస్థాన్ రాయల్స్ , సన్ రైజర్స్ , గుజరాత్ టైటాన్స్ టైటిళ్లను కైవసం చేసుకున్నాయి. కొత్తగా ఎంట్రీ ఇస్తూనే దుమ్ము రేపింది హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్. తాజాగా జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో సైతం పాయింట్ల పట్టికలో సూపర్ పొజిషన్ లో కొనసాగుతోంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా బ్యాటింగ్ కు దిగింది ముంబై ఇండియన్స్ . నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 139 రన్స్ చేసింది. నెహాల్ వధేరా 64 రన్స్ చేసి ఆదుకున్నాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ లో మరోసారి మెరిశారు ఓపెనర్లు డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్. కాన్వే 44 రన్స్ చేస్తే గైక్వాడ్ 30 రన్స్ తో రాణించాడు. అజింక్యా రహానే 21 రన్స్ చేస్తే శివమ్ దూబే 27 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు.
Also Read : సత్తా చాటిన రిలే రుస్సో