CSK vs RCB IPL 2022 : చెన్నై సూప‌ర్ కింగ్స్ టార్గెట్ 174 ర‌న్స్

రాణించిన మ‌హిపాల్ లామ్రోర్ ..డుప్లెసిస్

CSK vs RCB : ఐపీఎల్ లో భాగంగా జ‌రుగుతున్న లీగ్ మ్యాచ్ లో 8 వికెట్లు కోల్పోయి రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(CSK vs RCB) 173 ప‌రుగులు చేసింది. సీఎస్కే ముందు 174 ప‌రుగుల టార్గెట్ ముందుంచింది. సీఎస్కే బౌల‌ర్లు చాలా వ‌ర‌కు ప‌రుగులు చేయ‌నీయ‌కుండా క‌ట్ట‌డి చేశారు.

42 ప‌రుగులు చేసి స‌త్తా చాటిన ఆర్సీబీ ప్లేయ‌ర్ లామ్రోర్ ను మీష్ తీక్ష‌ణ ఔట్ చేశాడు. ఆ త‌ర్వాతి బంతికి హ‌స‌రంగాను గోల్డెన్ డ‌క్ గా పంపించాడు. చివ‌రి బంతికి షాబాజ్ అహ్మ‌ద్ ను ఒక్క ప‌రుగుకే వెన‌క్కి పంపించాడు.

దినేష్ కార్తీక్ ఆఖ‌రులో ఓ మోస్త‌రు స్కోర్ చేశాడు. ర‌జ‌త్ పాటిదార్ 21 ర‌న్స్ చేసి నిరాశ ప‌రిచాడు. ప్రిటోరియ‌స్ బౌలింగ్ లో ముకేష్ కు క్యాచ్ ఇచ్చాడు. ఆర్సీబీ కెప్టెన్ పాఫ్ డుప్లెసిస్ 38 ప‌రుగులు చేశాడు.

మొయిన్ ఆలీ అద్భుత‌మైన బంతికి బోల్తా కొట్టించాడు. ర‌వీంద్ర జ‌డేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. విరాట్ కోహ్లీ 30 ప‌రుగులుచేశాడు. ఆఖ‌రులో దినేష్ కార్తీక్ 17 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ 2 సిక్స‌ర్ల‌తో 26 ర‌న్స్ చేయ‌డంతో ఆ మాత్రం స్కోర్ సాధించింది.

ఇక చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK vs RCB)బౌల‌ర్ల‌లో మ‌హీష్ తీక్ష‌ణ 3 మూడు వికెట్లు తీశాడు. మొయిన్ అలీ 2 విఎట్లు తీస్తే ప్రిటోరియ‌స్ ఒక వికెట్ తీశాడు. అంత‌కు ముందు సీఎస్కే స్కిప్ప‌ర్ ధోనీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

ఈ మ్యాచ్ ఆర్సీబీకి సీఎస్కేకు మ‌ధ్య ఈ మ్యాచ్ అత్యంత కీల‌కం. ప్ర‌ధానం కూడా. సీఎస్కే ప్లే ఆఫ్స్ కు చేరాలంటే ఈ మ్యాచ్ గెల‌వాల్సి ఉంది.

Also Read : టీ20లో భార‌త్ టెస్టులో ఆసిస్ వ‌న్డేలో కీవీస్

Leave A Reply

Your Email Id will not be published!