Chetan Sharma Comment : ‘చేతన్ శర్మ’కు పట్టం కానుందా శాపం
ఒక వర్గానికే కొమ్ము కాస్తున్న బీసీసీఐ
Chetan Sharma Comment : ఈ దేశంలో అత్యధిక ఆదాయంతో పాటు విపరీతమైన రాజకీయాలకు కేరాఫ్ గా మారింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. ఇప్పటికే ప్రతిభ కలిగిన ఆటగాళ్లను పక్కన పెట్టారన్న విమర్శలు ఉన్నాయి. ఇదే సమయంలో బీసీసీఐకి కొత్త బాస్ గా కొలువు తీరారు మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ. ఆయన ఒక్కడే కొత్త కార్యవర్గంలో మైదానంలో ఆడింది.
మిగతా వాళ్లంతా ఆయా క్రికెట్ అసోసియేషన్ల ద్వారా సెలెక్టు అయిన వాళ్లే. వీళ్లంతా భారతీయ జనతా పార్టీకి చెందిన మంత్రులకు చెందిన బంధువులే కీలక పోస్టులలో నియమితులయ్యారు. ఒకే వర్గానికి, ఒకే కులానికి చెందిన వారే ఆధిపత్యం చెలాయిస్తూ వస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఆ వర్గానికి చెందిన వారే డామినేట్ చేస్తూ వస్తున్నారని, ప్రతిభ కలిగిన ఆటగాళ్లను తొక్కి పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. సెలెక్షన్ కమిటీ నిర్వాకం కారణంగా అద్భుతంగా ఆడుతూ వస్తున్న కేరళ స్టార్ సంజూ శాంసన్(Sanju Samson) చాలా సీరీస్ లకు దూరమయ్యాడు. ఇలాంటి ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు.
జట్టులో చోటు దక్కని వాళ్లు. కేవలం ప్రతిభ ఆధారంగా ఎంపికవుతున్న వాళ్లు మాత్రం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ ) లో సత్తా చాటుతున్నారు. వర్దమాన ఆటగాళ్లకు ఈ రిచ్ లీగ్ బూస్ట్ గా ఉపయోగ పడుతోంది. ఇది కాదనలేని సత్యం. ఇక్కడ ఆడే ప్లేయర్లు ఇతర దేశాల్లో జరిగే క్రికెట్ లీగ్ లలో పాల్గొన కూడదని రూల్ విధించింది బీసీసీఐ.
ఇదే సమయంలో కొత్త కమిటీ ఏర్పాటయ్యాక కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా సెలెక్షన్ కమిటీని పూర్తిగా రద్దు చేసింది. కొత్త కమిటీ కోసం దరఖాస్తులు స్వీకరించింది. ఈ సెలెక్షన్ కమిటీని ఎంపిక చేసేందుకు గాను క్రికెట్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసింది బీసీసీఐ.
ఇప్పటికే అజయ్ రాత్రా, అమయ్ ఖుర్సియా, ఎస్ శరత్ , తదితర మాజీ ఆటగాళ్లు సెలెక్షన్ కమిటీలో చోటు కోసం పోటీ పడుతున్నారు. వీరితో పాటు చేతన్ శర్మ(Chetan Sharma), హ్విందర్ సింగ్ లను సైతం ఇప్పటికే ఇంటర్వ్యూ చేసింది. మరోసారి చేతన్ శర్మ సెలెక్షన్ కమిటీ చైర్మన్ గా ఎంపిక చేసేందుకు బీసీసీఐ డిసైడ్ అయినట్లు క్రికెట్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈస్ట్ జోన్ కు చెందిన మాజీ ఓపెనర్ ఎస్. ఎస్. దాస్ , సౌత్ జోన్ నుంచి మాజీ బ్యాటర్ శరత్ పోటీ పడుతున్నారు. మొత్తంగా బీసీసీఐ ఒకవేళ చేతన్ శర్మకు గనుక తిరిగి చైర్మన్ గా ఎంపిక చేస్తే మరోసారి ఒకే వర్గానికి చెందిన ఆటగాళ్లకే ప్రయారిటీ లభించడం ఖాయమన్న విమర్శలు లేక పోలేదు. ఇప్పటికే పర్ ఫార్మెన్స్ బాలేదని రద్దు చేసిన బీసీసీఐ తిరగి శర్మకు(Chetan Sharma) ఎలా అప్పగిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read : సెలెక్షన్ కమిటీ ఎంపికపై కసరత్తు