Chetan Sharma : చేతన్ శర్మ ముందు సవాళ్లు ఎన్నో
రెండోసారి మనోడి వైపు బీసీసీఐ మొగ్గు
Chetan Sharma : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఎట్టకేలకు ఉత్కంఠకు తెర దించింది. భారత క్రికెట్ జట్టులో మోస్ట్ పాపులర్ బౌలర్ గా పేరొందిన చేతన్ శర్మ(Chetan Sharma) మరోసారి భారత క్రికెట్ సెలక్షన్ కమిటీకి చైర్మన్ గా ఎన్నికయ్యాడు. ఇప్పటికే పలు విమర్శలు ఉన్నాయి. కేవలం ఒక వర్గానికి , కొన్ని ప్రాంతాలకు మాత్రమే మొగ్గు చూపుతున్నాడనే ఆరోపణలు లేక పోలేదు.
ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్ కప్ తర్వాత సెలక్షన్ కమిటీని పూర్తిగా రద్దు చేసింది బీసీసీఐ. ఇదే సమయంలో తాత్కాలిక చైర్మన్ గా కొనసాగించింది చేతన్ శర్మను. ప్రధానంగా కేరళ స్టార్ సంజూ శాంసన్ అద్భుతంగా రాణించినా పక్కన పెట్టడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఓ వైపు బీసీసీఐని చక్రం తిప్పుతున్న జే షా సైతం శాంసన్ పట్ల ఒకింత వివక్ష చూపిస్తున్నారన్న విమర్శలున్నాయి.
ఇదే క్రమంలో సోషల్ మీడియా వేదికగా గత కొంత కాలంగా సంజూ శాంసన్ ట్రెండింగ్ లో కొనసాగుతున్నాడు. మాజీ ఫాస్ట్ బౌలర్ ఈసారైనా పారదర్శకతతో జట్టును ఎంపిక చేస్తారని కోరుతున్నారు అభిమానులు. బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. ప్రత్యేక అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఇంటర్వ్యూ కూడా నిర్వహించింది.
శనివారం పూర్తి ప్యానల్ కమిటీని ఖరారు చేసింది. వీరిలో సలీల్ అంకోలా, శివ సుందర్ దాస్ , సుబ్రొతో బెనర్జీ, శ్రీధరన్ శరత్ ఉన్నారు. మొత్తం 600 దరఖాస్తులు రాగా వారిలో 11 మందిని ఎంపిక చేసింది.
ఇంటర్యూ అనంతరం శశికళా నాయక్, అశోక్ మల్హోత్రా, జతిన్ పరేంజ్ తో కూడిన సలహా కమిటీ వీరిని ప్రకటించింది. ఇక భారత్ ముందు పెను సవాళ్లు ఉన్నాయి. ఆస్ట్రేలియాతో సీరీస్ , ఆసియా కప్ , వన్డే వరల్డ్ కప్ లో భారత్ ఆడనుంది.
Also Read : రోహిత్ శర్మ ఫిట్ నెస్ పై అనుమానం