China Taiwan : సై అంటున్న చైనా రెఢీ అంటున్న తైవాన్

క‌మ్ముకుంటున్న యుద్ధ మేఘాలు

China Taiwan : ఓ వైపు ఇంకా యుద్దం ముగించ‌లేదు ఉక్రెయిన్ పై ర‌ష్యా. ఈ త‌రుణంలో యావ‌త్ ప్ర‌పంచం యుద్దం వ‌ద్దు శాంతి ముద్దు అని కోరుతోంది. కానీ ర‌ష్యా వినిపించు కోలేదు.

తాజాగా ర‌ష్యాకు వంత పాడుతూ ప్ర‌పంచంపై పెత్త‌నం చెలాయించాల‌ని చూస్తున్న చైనా మ‌రోసారి త‌న ప్ర‌తాపాన్ని చూపించేందుకు రెడీ అంటోంది.

ప్ర‌శాంతంగా ఉన్న తైవాన్ అనే తేనె తుట్టెను క‌దిలించింది పెద్ద‌న్న అమెరికా. ఆ దేశానికి ఏ దేశమూ కూల్ గా ఉండ‌డం ఇష్ట‌ప‌డ‌దు. ఎందుకంటే

వ‌ర‌ల్డ్ లోనే అత్య‌ధిక ఆయుధాలు త‌యారు చేసేది ఆ దేశ‌మే.

అమెరికాలో నివ‌సిస్తున్న ప్ర‌జ‌ల కంటే గ‌న్స్ ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ఇటీవ‌ల నివేదిక‌లో వెల్ల‌డైంది. తాజాగా యుద్ధ మేఘాలు క‌మ్ముకునేలా ఉన్నాయి. ఇందుకు తైవాన్ ప్ర‌ధాన కేంద్రంగా మారింది. తైవాన్ త‌మ‌దేనంటోంది చైనా(China Taiwan).

కాదు తాము స్వ‌తంత్రంగా ఉంటామ‌ని అంటోంది తైవాన్. సందింట్లో స‌డేమియా అన్న చందంగా అమెరికా ఇందులో దూరింది. తైవాన్ కు తాము

అండ‌గా ఉంటామ‌ని అంటోంది.

దీనిపై చైనా క‌న్నెర్ర చేసింది. తైవాన్ భూభాగంపై కాలు మోపితే ఖ‌బ‌డ్దార్ అంటూ హెచ్చ‌రించింది. వీట‌న్నింటిని బేఖాత‌ర్ చేస్తూ ముందుకు అడుగు వేసింది స్పీక‌ర్ నాన్సీ.

దీంతో చైనా అన్నంత ప‌ని చేసింది. 21 ఫైట‌ర్ జెట్ ల‌ను రంగంలోకి దించింది. తైవాన్ గ‌గ‌న‌తలంలోకి ఎంట్రీ ఇచ్చింది. సైనిక విన్యాసాలు ప్రారంభించింది.

తీవ్ర ఉద్రిక్త‌త‌ల మ‌ధ్య నాన్సీ టూర్ ముగిసింది. ఈ సంద‌ర్భంగా ఆమె కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తైవాన్ కు అమెరికా అన్ని విధాలుగా అండ‌గా నిలుస్తుంద‌ని ప్ర‌క‌టించింది.

తైవాన్ తో ఏ దేశ‌మూ సంబంధాలు పెట్టుకోవ‌ద్దంటూ చైనా కు షాక్ ఇచ్చింది. నిప్పుతో చెల‌గాటం ఆడ‌టం మంచిది కాదంది చైనా. అమెరికా రాయ‌బారిని పిలిపించి చీవాట్లు పెట్టింది చైనా.

త‌మ‌కు మ‌ద్ద‌తు ఇస్తున్నందుకు ధ‌న్య‌వాదాలు తెలిపింది తైవాన్ ప్రెసిడెంట్ సై ఇంగ్ వెన్. మ‌రో వైపు తైవాన్ పై ఆంక్ష‌లు ప్రారంభించింది చైనా.

దానిని ఒంట‌రిదాన్ని చేసి చేజిక్కించు కోవాల‌ని చూస్తోంది. ఇంకో వైపు భార‌త్ తో గిల్లి క‌జ్జాల‌కు దిగుతోంది. ఏది ఏమైనా ప్ర‌శాంతంగా ఉన్న ప్రాంతంలో అమెరికా చిచ్చు పెట్టి చోద్యం చూస్తోంది.

Also Read : భార‌త్ సాయానికి రుణ‌ప‌డి ఉన్నాం

Leave A Reply

Your Email Id will not be published!