Li Qiaoming : చైనా కింగ్ లి కియా మింగ్
గృహ నిర్బంధంలో జిన్ పింగ్
Li Qiaoming : ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ రేపింది చైనా దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ గృహ నిర్బంధంలో ఉన్నారని. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
ఇదే సమయంలో చైనాపై పూర్తి అవగాహన ఉన్న ఏకైక నాయకుడిగా పేరొందిన భారతీయ జనతా పార్టీ మాజీ ఎంపీ, ప్రముఖ న్యాయవాది సుబ్రమణ్య
స్వామి ట్విట్టర్ వేదికగా ఇదే విషయాన్ని ప్రస్తావించారు.
జిన్ పింగ్ స్థానంలో కొత్త అధ్యక్షుడిగా లి కియా మింగ్ బాధ్యతలు స్వీకరించినట్లు సమాచారం. లి అనేది ఇంటి పేరు. ప్రస్తుతానికి చైనా ఆర్మీకి అతడే సర్వాధికారిగా ఉన్నారు.
2017 నుంచి 2022 దాకా చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు. లి కియా మింగ్ ఏప్రిల్ 1961లో పుట్టారు. ఆయన వయసు 61 ఏళ్లు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
జిన్ పింగ్ తర్వాత ఎవరు అనే ప్రశ్నకు లి కియా మింగ్ అవుతారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ తరుణంలో సైనిక తిరుగుబాటు చోటు చేసుకున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి.
ఆర్మీ పరంగా చూస్తే లి కియా మింగ్ అలీజెన్స్ పీపుల్స్ రిపబ్లిక ఆఫ్ చైనా, బ్రాంచ్ సర్వీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ గ్రౌండ్ ఫోర్స్ కు చీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు.
ఆర్మీ జనరల్ గా ప్రస్తుతం బాధ్యతలు చేపట్టారు. నార్తర్న్ థియేటర్ కమాండర్ గా పని చేశాడు. హెనాన్ ప్రావిన్స్ లోని యాన్షిలో పుట్టాడు లి కియా మింగ్.
1976లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో చేరాడు.
361వ రెజిమెంట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా, 364వ రెజిమెంట్ కమాండర్ గా, 124వ డివిజన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ , డిప్యూటీ చీఫ్ గా పని చేశాడు లి కియా మింగ్.
42వ గ్రూప్ ఆర్మీ స్టాఫ్ 124వ డివిజన్ కమాండర్ గా పని చేశాడు.
జనవరి 2010లో లి కియా మింగ్ 41వ గ్రూప్ ఆర్మీకి చీఫ్ ఆఫ్ స్టాప్ గా నియమితుడయ్యాడు. జూలై 2011లో మేజర్ జనరల్ హోదా దక్కింది. 2013లో 41వ ఆర్మీ కమాండర్ గా పదోన్నతి పొందాడు.
2013లో సోవియట్ ఆర్మీ గురించి ఓ వ్యాసం కూడా రాశాడు లి కియా మింగ్. 2016లో నార్తర్న్ థియేటర్ కమాండ్ గ్రౌండ్ ఫోర్స్ కమాండర్ అయ్యాడు.
కొన్ని నెలల తర్వాత లెఫ్టినెంట్ జనరల్ హోదా పొందాడు.
2017లో తిరిగి నార్తర్న్ థియేటర్ కమాండ్ కమాండర్ గా పదోన్నతి పొందాడు. జనరల్ సాంగ్ పుక్సువాన్ అనంతరం సెంట్రల్ మిలిటరీ కమిషన్ కు
చెందిన లాజిస్టిక్ సపోర్ట్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ గా నియమించబడ్డాడు లి కియా మింగ్(Li Qiaoming).
అక్టోబర్ 2017లో లి కియా మింగ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా 19వ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. మొత్తంగా మరోసారి వార్తల్లోకి వచ్చాడు.
Also Read : చైనాలో సైనిక తిరుగుబాటు