China Warning : అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్

నాన్సీ పెలోసీ తైవాన్ ను సంద‌ర్శిస్తే

China Warning : చైనా, అమెరికా దేశాల మ‌ధ్య ఆధిప‌త్య పోరు మ‌రింత కొన‌సాగుతోంది. బైడెన్ వ‌చ్చాక మారుతుంద‌ని భావించిన దేశాల‌కు అలాంటిదేమీ క‌నిపించడం లేదు. ఒక‌రిపై మ‌రొక‌రు క‌త్తులు దూసుకుంటున్నారు.

ఇప్ప‌టికే ఉక్రెయిన్ పై ర‌ష్యా భీక‌ర దాడి కొన‌సాగిస్తూనే ఉంది. దీని విష‌యంలో చైనా మౌనంగా ఉంది. డ్రాగ‌న్ ర‌ష్యాకు స‌పోర్ట్ చేస్తే అమెరికా ఉక్రెయిన్ వైపు నిలిచింది.

తాజాగా తైవాన్ విష‌యంలో అమెరికా, చైనాలు క‌య్యానికి కాలు దువ్వుతున్నాయి. తైవాన్ భూ భాగం ముమ్మాటికీ త‌మ‌దేనంటోంది. ప‌దే ప‌దే జోక్యం చేసుకునేందుకు రెడీ అవుతోంది.

అయితే తైవాన్ మాత్రం స‌సేమిరా అంటోంది. త‌మ‌పై దాడికి పాల్ప‌డితే చైనాను(China Warning) ఎదుర్కొనేందుకు స‌న్నద్ధంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించింది. దీంతో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది.

తాజాగా తైవాన్ విష‌యంలో ఏ మాత్రం అమెరికా జోక్యం చేసుకున్నా చూస్తూ ఊరుకోబోమంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది చైనా. తాజాగా అమెరికా హౌస్ స్పీక‌ర్ నాన్సీ పెలోసీ తైవాన్ లో ప‌ర్య‌టించాల‌ని నిర్ణ‌యించుకుంది.

విష‌యం తెలిసిన చైనా తీవ్ర అభ్యంత‌రం తెలిపింది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. త‌గిన రీతిలో మూల్యం చెల్లించు కోవాల్సి వ‌స్తుంద‌ని వార్నింగ్ ఇచ్చింది అమెరికాకు.

జ‌ర‌గ‌బోయే ప‌రిణామాల‌కు అమెరికా బాధ్య‌త వహించాల్సి వ‌స్తుంద‌ని చైనా(China Warning) విదేశాంగ శాఖ అధికార ప్ర‌తినిధి హువా చున్ యింగ్ పేర్కొన్నారు.

చైనా సార్వ‌భౌమ భ‌ద్ర‌తా ప్ర‌యోజ‌నాల‌ను దెబ్బ తీస్తే దానికి బాధ్య‌త వ‌హించాల్సింది అమెరికానేన‌ని స్ప‌ష్టం చేసింది. త‌గిన మూల్యం చెల్లించ‌క తప్ప‌ద‌ని పేర్కొంది.

Also Read : అల్ ఖైదా చీఫ్ హ‌త్య స‌బ‌బే – ఒబామా

Leave A Reply

Your Email Id will not be published!