Chiranjeevi : మన్సూర్ కామెంట్స్ చిరంజీవి సీరియస్
నటి త్రిష కృష్ణన్ కు సంపూర్ణ మద్దతు
Chiranjeevi : హైదరాబాద్ – మెగాస్టార్ చిరంజీవి సీరియస్ కామెంట్స్ చేశారు. తమిళ సినీ రంగానికి చెందిన ప్రముఖ నటుడు మన్సూర్ అలీ ఖాన్ నటి త్రిష కృష్ణన్ గురించి చేసిన వెకిలి వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. లియో సినిమా షూటింగ్ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్రిష తో తనకు రేప్ సీన్ ఉండేదని భావించానని కానీ అది లేకుండా చేశాడంటూ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పై.
Chiranjeevi Comment
మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. జాతీయ మహిళా కమిషన్ త్రిష పట్ల దారుణమైన రీతిలో మాట్లాడటం, వ్యక్తిగతంగా దిగజారు మాటలు మాట్లాడటంపై సీరియస్ అయ్యింది. వెంటనే తమిళనాడు డీజీపీ నటుడిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.
ఈ సందర్భంగా సినీ రంగానికి చెందిన ప్రతి ఒక్కరు ఖండించారు. త్రిష కృష్ణన్ పట్ల దిగజారి మాట్లాడటాన్ని తప్పు పట్టారు. తాజాగా మంగళవారం మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ట్విట్టర్ వేదికగా స్పందించారు. త్రిషపై మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు చిరంజీవి.
Also Read : CPI Narayana : బిగ్ బాస్ బ్రోతల్ హౌస్