Chiranjeevi : కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా
ఎలా ఉన్నారని ప్రశ్నించిన చిరు
Chiranjeevi : హైదరాబాద్ – బాత్రూంలో జారి పడి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు క్యూ కట్టారు. సినీ, వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన వారు పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు.
Chiranjeevi Met KCR
సినీ రంగానికి చెందిన ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) యశోదకు చేరుకున్నారు. ఆయనకు తమ తండ్రి ఆరోగ్యం గురించి వివరించారు కొడుకు కేటీఆర్, కూతురు కవిత. ఇదిలా ఉండగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉన్నకేసీఆర్ ఉన్నట్టుండి బాత్రూంలో జారి పడ్డారు.
దీంతో ఆయన తుంటి విరిగింది. పడి పోయిన ఆయనను హుటా హుటిన హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు చేపట్టారు.
తుంటి విరిగిందని శస్త్ర చికిత్స చేయాలని స్పష్టం చేశారు. అయితే ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దీంతో ఊపిరి పీల్చుకున్నారు కల్వకుంట్ల కుటుంబం. పరీక్షలు చేసిన అనంతరం కేసీఆర్ కు ఆపరేషన్ చేయడం, అది పూర్తిగా సక్సెస్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Also Read : Chandra Babu Naidu : మిత్రమా ఎలా ఉన్నావు