Rakesh Master : కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ కన్నుమూత
తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో విషాదం
Rakesh Master : టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. నిన్న ప్రముఖ నటుడు శరత్ బాబు , మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ మృతితో కోలుకోలేని స్థితిలో ఉన్న సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఇంకొకరు లేరన్న వార్తను జీర్ణించుకోలేక పోతోంది. 53 ఏళ్ల రాకేష్ మాష్టర్ ఆదివారం తుది శ్వాస విడిచారు. విజయనగరం నుంచి హైదరాబాద్ కు వస్తుండగా మార్గమధ్యంలో ఆయనకు సన్ స్ట్రోక్ కు గురైనట్లు సమాచారం. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను హుటా హుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కన్నుమూశారు. రాకేష్ మాస్టర్ మృతి వార్తతో విషాదం అలుముకుంది.
తొలుత తన కెరీర్ ను బుల్లి తెర నుంచి స్టార్ట్ చేశారు. ఆయన ఆట ప్రోగ్రాంతో ప్రసిద్ది చెందారు. అనంతరం సినీ రంగంలోకి ఎంటర్ అయ్యారు. ఏకంగా 1500 సినిమాలకు నృత్య దర్శకుడిగా పని చేశారు రాకేష్ మాస్టర్(Rakesh Master). కొంత కాలం నుంచి సినిమా రంగానికి దూరంగా ఉంటున్నారు. అయితే సామాజిక మాధ్యమాలలో యాక్టివ్ గా ఉన్నారు. తనకంటూ ఓ స్వంత యూట్యూబ్ లో ఛానల్ కూడా ఉంది. కొందరిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిగత విమర్శలకు దిగడం కొంత ఎబ్బెట్టుగా అనిపించేలా చేసింది రాకేష్ మాస్టర్ చేసిన కామెంట్స్. ప్రస్తుతం పేరు పొందిన కొరియా గ్రాఫర్లు జానీ , శేఖర్ రాకేష్ మాష్టర్ వద్ద కొరియోగ్రఫీ నేర్చుకున్నారు.
Also Read : Actor Vijay Comment : ‘విజయ్’ కలకలం కానుందా సంచలనం