Chris Gayle : స్టార్ హిట్టర్, విండీస్ విధ్వంసకర బ్యాటర్ క్రిస్ గేల్ (Chris Gayle)ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీజీ నుంచి నాకు వ్యక్తిగతంగా సందేశం (మెస్సేజ్ ) వచ్చింది.
ఆ మెస్సేజ్ నన్ను నిద్ర నుంచి తట్టి లేపింది. చూస్తే భారత ప్రధాని నుంచి ఆశ్చర్య పోయాను. గత కొన్నేళ్లుగా భారత ప్రధాన మంత్రితో నాకు వ్యక్తిగత అనుబంధం ఉంది.
ఇవాళ భారత దేశం అత్యున్నత గణతంత్ర దినోత్సవ పండుగను జరుపుకుంటోంది. కోట్లాది భారతీయులందరికీ, దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రపతికి, నాయకత్వం వహిస్తున్న ప్రధాని మోదీకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియ చేస్తున్నానని పేర్కొన్నాడు ఈ దిగ్గజ క్రికెటర్.
ప్రధానంగా భారత్ తో నాకు విడదీయలేని అనుబంధం ఉందని తెలిపాడు. ఐపీఎల్ రిచ్ లీగ్ తో తాను మరింత దగ్గరయ్యానని, ప్రత్యేకించి భారతీయుల ఆదరాభిమానాలు, ప్రేమ గొప్పవన్నారు.
ప్రధానంగా మోదీ వాత్సల్య పూర్వకమైన పలకరింపు తనను ఎంతగానో ఇంప్రెస్ చేసిందన్నాడు ఈ క్రికెటర్. 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మోదీ వ్యక్తిగత సందేశం పంపించడాను తాను ఎళ్లకాలం గుర్తు పెట్టుకుంటానని సంతోషం వ్యక్తం చేశాడు క్రిస్ గేల్(Chris Gayle).
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని యూనివర్సల్ బాస్ అంటూ సంభోదిస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇదిలా ఉండగా కరోనా కష్ట కాలంలో వెస్టిండీస్ కు భారత దేశం తరపు నుంచి ఉచితంగా కరోనా కట్టడి కోసం వ్యాక్సిన్లు పంపించారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా తమ ప్రజల నుంచి పీఎంకు కృతజ్ఞతలు తెలియ చేశాడు క్రిస్ గేల్.
Also Read : అశ్విన్ అద్భుతమైన బౌలర్ – వార్న్