Chris Morris : ఇది ఊహించని దెబ్బ. ప్రధానంగా రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజ్ కు. కీలక ఆటగాడిగా ఇప్పటి దాకా సేవలు అందించిన ఈ అద్భుత ప్లేయర్ ఇక తాను ఆడలేనంటూ ప్రకటించాడు.
దీంతో క్రికెట్ అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే తాను ఆట నుంచి తప్పుకున్నా కోచ్ రూపంలో పని చేస్తానని చావు కబురు చల్లగా చెప్పాడు.
గత ఏడాది ఐపీఎల్ 2021లో మెగా వేలం ద్వారా భారీ ధరకు రాజస్థాన్ రాయల్స్ క్రిస్ మోరిస్ (Chris Morris)ను తీసుకుంది. ప్రస్తుతం తల పట్టుకుంటోంది.
ఒక రకంగా ఆ జట్టుకు బిగ్ షాక్ అని చెప్పక తప్పదు. మరో వైపు స్కిప్పర్ సంజూ శాంసన్ కూడా వదిలి వెళుతున్నట్లు టాక్ వచ్చింది. దీనిపై ఎలాంటి పెదవి విప్ప లేదు సంజూ. భారీ ధరకు అతడిని అట్టే పెట్టుకుంది రాజస్తాన్ రాయల్స్.
ఆ జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఆశించిన మేర రాణించ లేక పోతోంది. గతంలో ఐపీఎల్ విజేతగా నిలిచింది. రాను రాను టీమ్ ను మార్చినా చివరకు స్కిప్పర్ ను మార్చినా దాని తల రాత మార లేదు.
ఈ తరుణంలో కీలక ఆటగాడిగా పనికి వస్తాడని భారీ వేలానికి చేజిక్కించుకున్న క్రిస్ మోరిస్(Chris Morris) ఇలా తప్పు కోవడంతో షాక్ కు గురైంది ఆర్ఆర్. అన్ని రకాల ఫార్మాట్ ల నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు మోరిస్.
ఈ క్రికెట్ జర్నీలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ థ్యాక్స్ అని పేర్కొన్నాడు. టైటాన్ కు కోచ్ కు బాధ్యతలు చేపట్టడం పట్ల సంతోషంగా ఉన్నానని పేర్కొనడం విశేషం.
దేశీవాళీ టీ20 జట్టుకు కోచ్ గా ఉంటానని పేర్కొన్నాడు క్రిస్ మోరిస్.
Also Read : వ్యక్తిత్వం జీవితం ఆదర్శనీయం