Actor Krishna : శోక సంద్రం దివికేగిన నట దిగ్గజం
తెలుగు సినిమాపై చెరగని ముద్ర
Actor Krishna : తెలుగు సినిమా మరో దిగ్గజాన్ని కోల్పోయింది. సూపర్ స్టార్ కృష్ణ(Actor Krishna) మంగళవారం ఉదయం కన్ను మూశారు. ఇక రానంటూ తరలి రాని తీరాలకు వెళ్లి పోయారు. ఆయన మృతితో ఒక తరానికి చెందిన నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వర్ రావు, కృష్ణం రాజు, ఘట్టమనేని శివరామ కృష్ణ తమదైన ముద్రను కనబరిచి విషాదంలోకి నెట్టి వేశారు.
1942 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం ఆయన స్వస్థలం. సూపర్ స్టార్ కు 80 ఏళ్లు. చెరగని చిరునవ్వు ఆయన స్వంతం. తెలుగు సినిమా రంగానికి కృష్ణ ఎన్నో సేవలు చేశారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, పద్మాలయ స్టూడియో అధినేతగా, ప్రజలను ప్రేమించే వ్యక్తిగా చివరి దాకా తనదైన ముద్ర కనబరిచారు.
ఆయనకు ఇద్దరు భార్యలు . ఒకరు విజయ నిర్మల. ఆమె కూడా నటి. మరొకరు ఇందిరా దేవి. ఇటీవల కన్ను మూశారు. తాను ప్రేమించిన కొడుకు నటుడు రమేశ్ బాబు చిన్న వయస్సులోనే కన్ను మూశారు. దీంతో తీవ్రంగా కలత చెందారు సూపర్ స్టార్ కృష్ణ. సడన్ గా గుండె పోటు రావడంతో కాంటినెంటల్ ఆస్పత్రిలో చేర్చారు.
1970, 1980 లలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడిగా కృష్ణ పేరు పొందారు. 1964 వరకు ఆయన చిన్న చిన్న పాత్రలు చేశారు. ఆ తర్వాత తేనె మనసులు సినిమాలో హీరోగా తొలిసారిగా నటించారు.
గూఢచారి 116 చిత్రం. జనాదరణ పొందడంతో హీరోగా నిలదొక్కుకున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు సినిమా రంగంలో సక్సెస్ ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు.
దాదాపు 340కి పైగా చిత్రాలలో ప్రధాన పాత్రల్లో నటించారు. తన నటనతో మెప్పించారు. 1970లో నిర్మాణ సంస్థను ప్రారంభించారు. పద్మాలయ స్టూడియో ద్వారా పలు సక్సెస్ ఫుల్ సినిమాలు తీశాడు.
దర్శకుడిగా 16 సినిమాలు తీశాడు. తెలుగులో తొలి జేమ్స్ బాండ్ మూవీ కూడా సూపర్ స్టార్ కృష్ణదే కావడం విశేషం. తొలి కౌబాయ్ మూవీ మోసగాళ్లకు
మోసగాడు మూవీ, తొలి పుల్ స్కోప్ చిత్రం అల్లూరి సీతారామరాజు, తొలి 70 ఎంఎం సినిమా సింంహాసనం కూడా ఆయనదే.
పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, పాడిపంటలు, ఈనాడు, అగ్ని పర్వతం తదితర సూపర్ హిట్ సినిమాలు తన కెరీర్ లో మరిచి పోలేనివి. 1964 నుంచి 1995 వరకు కృష్ణ సగటున పదేళ్లకు 100 సినిమాలు తీశారు. అంటే ఏడాదికి 10 సినిమాల చొప్పున 300 సినిమాలు పూర్తి చేసిన ఘనత సూపర్ స్టార్ దే.
ఇందు కోసం మూడు షిప్టులు పని చేసిన ఘనత ఆయనదే. కృష్ణకు భారీ ఎత్తున అభిమాన సంఘాలు ఉన్నాయి. మద్రాసులో జరిగిన సినిమా శత దినోత్సవం సందర్బంగా వేలాది మంది అభిమానులు స్వచ్చందంగా తరలి వచ్చారు.
సినిమా రంగానికి చేసిన సేవలకు గాను సూపర్ స్టార్ కృష్ణకు సాఫల్య పురస్కారం అందుకున్నారు. 2003లో ఎన్టీఆర్ జాతీయ అవార్డు పొందారు. ఆంధ్రా యూనివర్శిటీ 2008లో గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. 2009లో కేంద్ర సర్కార్ పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. 1984 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎన్టీఆర్ సర్కార్ ను విమర్శిస్తూ సినిమాలు తీశాడు.
1989లో ఏలూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2010 నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఏది ఏమైనా నట శేఖరుడిగా
పేరొందిన కృష్ణను కోల్పోవడం తెలుగు సినిమాకు ఇరు తెలుగు రాష్ట్రాలకు తీరని నష్టం.
Also Read : వెండి తెరపై కృష్ణ చెరగని ముద్ర