CJI Chandrachud Comment : సీజేఐ ప్రశ్నలకు జవాబు ఏది
కేంద్ర సర్కార్ కు ఝలక్
CJI Chandrachud Comment : ఆయన అందరి లాంటి వ్యక్తి కాదు. అయ్యా జీ హుజూర్ అనేందుకు. వచ్చీ రావడంతోనే తనేమిటో రుచి చూపించారు. రాజ దండం కంటే మంత్ర దండం అనే న్యాయ వ్యవస్థ అత్యంత కీలకం అని చెప్పకనే చెప్పారు. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటామని అనుకుంటే పొరపాటు పడినట్లేనని చెప్పకనే చెప్పారు భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్.
న్యాయమూర్తిగా ఆయనకు ఎంతో అనుభవం ఉంది. అంతకు మించి సభ్య సమాజం పట్ల, ఈ దేశం పట్ల ఒక అవగాహన ఉంది. ప్రజాస్వామ్యంలో అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా ఉండాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. పలు సందర్భాలలో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయలు, వ్యక్తం చేసిన తీర్పులు, ఇచ్చిన సలహాలు ఆలోచింప చేసేలా ఉన్నా వాటిని స్వీకరించేందుకు కేంద్రం సిద్ద పడడం లేదు.
CJI Chandrachud Comment Viral
భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించే ఏది కూడా తాను స్వీకరించ బోనంటూ స్పష్టం చేశారు. ఆ మధ్యన ఆగమేఘాల మీద కేంద్ర ఎన్నికల కమిషనర్ ను నియమించేందుకు పడిన తపనను జస్టిస్ ధనంజయ చంద్రచూడ్(CJI Chandrachud) తప్పు పట్టారు. ఆ తర్వాత మోదీ పనిగట్టుకుని సీజేఐ లేకుండానే సీఈసీ, ఈసీల ఎంపికను చేసేందుకు పార్లమెంట్ లో బిల్లు తీసుకు వచ్చారు. అది ఆమోదం కూడా పొందింది.
ఇటీవల స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో సీజేఐ పాల్గొన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి కూడా హాజరైన ఈ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. చూసీ చూడనట్లుగా ఉన్నా తనేమీ అనుకోలేదు. దేశానికి రక్షణ కవచంగా ఉండాల్సింది న్యాయ వ్యవస్థ. అది ఎంత న్యాయ బద్దంగా ఉంటే ప్రభుత్వానికి అంత మంచిది. కానీ కేంద్రం పదే పదే సీజేఐ(CJI Chandrachud)తో చీవాట్లు తింటోంది. ప్రధానంగా మణిపూర్ విషయంలో మోదీ ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని తీవ్రంగా తప్పు పట్టారు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిద్ర పోతున్నాయా. ఒక వేళ మీకు చేత కానట్లయితే తామే రంగంలోకి దిగుతామంటూ హెచ్చరించారు. బహుశా ఇది మోదీకి, ఆయన పరివారానికి నచ్చక పోవచ్చు. భారీ స్థాయిలో హింస, అల్లర్లు చోటు చేసుకున్నా కించిత్ మానవత్వాన్ని ప్రదర్శించ లేక పోవడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు సీజేఐ.
ప్రతి సందర్భంలోనూ న్యాయ వ్యవస్థ వర్సెస్ కేంద్ర సర్కార్ గా మారి పోయింది. ఈ తరుణంలో సీజేఐ పదే పదే లేవదీస్తున్న ప్రశ్నలకు జవాబు చెప్పాల్సింది కేంద్రమే. దానికి సిద్దంగా ఉండక పోతే ఎలా అన్నది ఆలోచించు కోవాలి. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ముందు జాగ్రత్తగా ఆలోచించే రాశారు. ఎవరి పరిమితులు ఏమిటో అనేది. ఏది ఏమైనా సీజేఐ కంట్లో నలుసుగా మారడం ప్రస్తుతం కేంద్రానికి కంటగింపుగా మారిందని అనుకోక తప్పదు.
Also Read : Chandra Babu Naidu : పరిటాల రవి నిత్య చైతన్య దీప్తి