CJI Chandrachud : కేంద్రాన్ని ప్రశ్నించిన సీజేఐ
పంజాబ్, ఈశాన్యం గురించి ఏమిటి
CJI Chandrachud : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్(CJI Chandrachud) కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వాన్ని మరోసారి ఏకి పారేశారు. జమ్మూ కాశ్మీర్ విభజన గురించి ప్రశ్నించారు. పంజాబ్, ఈశాన్యం గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు.
CJI Chandrachud Asking Modi about Jammu & Kashmir
ఒక రాష్ట్రాన్ని విభజించే అధికారాన్ని కేంద్ర సర్కార్ కు ఇచ్చిన తర్వాత దానిని దుర్వినియోగం కాకుండా ఎలా చూస్తారంటూ భారత ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు కేంద్రాన్ని. అయితే జమ్మూ కాశ్మీర్ ఒక రకమైనదని కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ వాదించారు.
ఇదిలా ఉండగా జమ్మూ కాశ్మీర్ ఒక రకమైనది కాదని, పంజాబ్ , ఈశాన్య రాష్ట్రాలు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాయని , 2019 ఆగస్టులో సరిహద్దు రాష్ట్రాన్ని విభజించాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
ఒక రాష్ట్రాన్ని విభజించే అధికారాన్ని కేంద్ర సర్కార్ కు అంగీకరించిన తర్వాత దానిని దుర్వినియోగం చేయకుండా ఎలా నిర్దారిస్తారని నిలదీశారు. విభజన ప్రశ్న ఎందుకు ఉండ కూడదు అనే చర్చకు దారి తీసింది.
ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. ఈ సందర్బంగా జమ్మూ , కాశ్మీర్ ఒక రకమైనదని కేంద్రం వాదించింది.
Also Read : Bhatti Vikramarka : అసైన్డ్ భూములు పంపిణీ చేస్తాం