CJI Comment : ప‌త్రికా స్వేచ్ఛ‌పై ఉక్కుపాదం ప్ర‌మాదం

సుప్రీం తీర్పు కేంద్రానికి చెంప పెట్టు

CJI Comment : రాచ‌రికం కాదు ఇది ప్ర‌జాస్వామ్యం. డెమోక్ర‌సీకి మూల స్తంభం ప‌త్రికా స్వేచ్ఛ‌. దానిని హ‌రించే హ‌క్కు ఎవ‌రికీ లేదు. ఏదో ఒక కార‌ణాన్ని చూపి నిషేధించాల‌ని అనుకోవ‌డం మూర్ఖ‌త్వం. ప్ర‌జాస్వామ్యానికి ప్ర‌ధాన ర‌క్ష‌ణ క‌వచం ఏదైనా ఉందంటే అది ప‌త్రికా , ప్ర‌సార స్వేచ్ఛ మాత్ర‌మే. అది గ‌నుక లేక పోతే ఈ దేశంలో ఎమ‌ర్జెన్సీ ఉంద‌ని అనుకోవాలి.

అలాంటి ఆలోచ‌న‌లు రానీయ‌కూడ‌దు. కేంద్రం త‌న ప‌ని తాను చూసుకోవాలి. కానీ ఇత‌రుల హ‌క్కుల‌ను ఏదో ఒక నెపంతో తొక్కి పెట్టాల‌ని అనుకోవ‌డం మూర్ఖ‌త్వం. ఇది మంచి ప‌ద్ద‌తి కాదు.  ముఖ్యంగా ప్ర‌పంచానికి ఆద‌ర్శ ప్రాయంగా నిలుస్తూ వ‌చ్చిన ప్రజాస్వామ్య దేశానికి అని చుర‌క‌లు అంటించారు భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ధ‌నంజ‌య వై చంద్ర‌చూడ్(CJI Comment).

ఒక ర‌కంగా ఇది మోదీ ప్ర‌భుత్వానికి చెంప పెట్టు లాంటిద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. సీజేఐ కొలువు తీరాక వెలువురించిన అత్యున్న‌త‌మైన తీర్పుల‌లో ఇది ఒక‌టి. మ‌ల‌యాళ న్యూస్ ఛాన‌ల్ మీడియా వ‌న్ పై కేంద్రం నిషేధం విధించ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది సీజేఐ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.

ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. దేశానికే కాదు ప్ర‌భుత్వాల‌కు వాచ్ డాగ్ లాంటిది ప‌త్రికా వ్య‌వ‌స్థ‌. దానిని నియంత్రించాల‌ని అనుకోవ‌డం భ్ర‌మ అని కొట్టి పారేశారు. అందుకే న్యూస్ ఛాన‌ల్ నిషేధాన్ని ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ప్ర‌జ‌ల హ‌క్కుల‌ను కాల రేసేందుకు జాతీయ భ‌ద్ర‌త‌ను సాకుగా చూప‌లేం. ఈ కేసులో కేంద్ర హొం మంత్రిత్వ శాఖ అద్బుతంగా లేవ‌నెత్త‌డం త‌మ‌ను విస్తు పోయేలా చేసింద‌ని ధ‌ర్మాస‌నం పేర్కొంది.

విమ‌ర్శించినంత మాత్రాన మీడియాను నోరు మెద‌ప లేమ‌ని, జాతీయ భ‌ద్ర‌త దృష్ట్యా కేంద్రం ఆదేశించిన మ‌ల‌యాళ వార్తా ఛానెల్ పై ఆంక్ష‌ల‌ను ఎత్తి వేస్తున్న‌ట్లు వ్యాఖ్యానించింది. ప్ర‌భుత్వ విధానాలు , చ‌ర్య‌ల‌పై ఛానెల్ చేసిన విమ‌ర్శ‌ల‌ను దేశ వ్య‌తిరేక లేదా స్థాప‌న‌కు వ్య‌తిరేకం అని భావించ లేమ‌ని , స‌జీవ ప్ర‌జాస్వామ్యానికి స్వ‌తంత్ర ప‌త్రిక‌లు, ఛానెళ్లు అవ‌స‌ర‌మ‌ని అభిప్రాయ‌ప‌డింది.

ఛానెల్ ప్ర‌సార లైసెన్స్ ను పున‌రుద్ద‌రించేందుకు నిరాక‌రించిన స‌మాచార‌, ప్ర‌సార మంత్రిత్వ శాఖ తీరుపై మండిప‌డింది. ఇందుకు సంబంధించి హొం మంత్రిత్వ శాఖ‌ను నిల‌దీసింది.

ఛానెల్ ను ఎందుకు నిషేధించాల‌ని అనుకుంటున్నార‌నే దానికి కేంద్రం స‌రైన ఆధారాల‌ను చూప‌లేక పోయింద‌ని స్ప‌ష్టం చేసింది. ఇదే స‌మ‌యంలో కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ప్ర‌జ‌ల రోగ నిరోధ‌క చ‌ర్య‌ల వ‌ల్ల క‌లిగే హానిని నివారించేందుకు సీల్డ్ క‌వ‌ర్ ప్రొసీడింగ్స్ ను స్వీక‌రించ లేమ‌ని స్ప‌ష్టం చేసింది. మొత్తంగా ఇవాళ సీజేఐ చంద్ర‌చూడ్(CJI DY Chandrachud) ఆధ్వ‌ర్యంలో ఇచ్చిన తీర్పు దేశంలోని ప్ర‌జాస్వామిక వాదుల‌కు, మీడియాకు, ప‌త్రికా సంస్థ‌ల‌కు , జ‌ర్న‌లిస్టుల‌కు ఊతం ఇచ్చిన‌ట్ల‌యింది.

Also Read : మ‌నీష్ సిసోడియా క‌స్ట‌డీ పొడిగింపు

Leave A Reply

Your Email Id will not be published!