NV Ramana : మీడియాపై సీజేఐ సంచ‌ల‌న కామెంట్స్

హ‌ద్దులు దాట‌డం ప్ర‌జాస్వామ్యానికి ప్ర‌మాదం

NV Ramana : భార‌త దేశ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ(NV Ramana) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధానంగా సోష‌ల్, ఎల‌క్ట్రానిక్ మీడియా పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

శ‌నివారం జార్ఖండ్ లోని రాంచీలో జ‌రిగిన న్యాయ స‌మావేశంలో న్యాయ‌మూర్తి జీవితం పాత్ర అనే అంశంపై ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ఎల‌క్ట్రానిక్, సోష‌ల్ మీడియా ప్ర‌జాస్వామ్యానికి విఘాతం క‌లిగిస్తున్నాయంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. న్యాయ‌మూర్తుల‌పై ప్ర‌ధానంగా సోష‌ల్ మీడియా (సామాజిక మాధ్య‌మాలు) లో పెద్ద ఎత్తున ప్ర‌చారాలు జ‌రుగుతున్నాయి.

జ‌డ్జీలు వెంట‌నే స్పందించ‌క పోవ‌చ్చు. దయ‌చేసి దానిని బ‌ల‌హీన‌త లేదా నిస్స‌హాయ‌త అని పొర‌పాటు ప‌డ‌కండ‌ని సూచించారు జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌. మీడియా విచార‌ణ‌ల‌ను విమ‌ర్శించింది.

కొత్త మీడియా సాధనాలు అపార‌మైన విస్త‌రింప చేసే సామ‌ర్థ్యాన్ని క‌లిగి ఉంటాయ‌న్నారు. అయితే స‌రైన‌వి ఏవి, త‌ప్పులు ఏవి, మంచి చెడులు ఏవి , నిజ‌మైన‌వి, న‌కిలీవి ఏవి అనే తేడాను గుర్తించ లేవ‌ని పేర్కొన్నారు సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ‌(NV Ramana).

కేసుల‌ను నిర్ణ‌యించ‌డంలో మీడియా ట్ర‌య‌ల్స్ మార్గ‌ద‌ర్శ‌క అంశం కానే కాద‌న్నారు. కొన్ని స‌మ‌యాల్లో అనుభ‌వ‌జ్ఞులైన జ‌డ్జీలు కూడా నిర్ణ‌యించ‌డం క‌ష్టంగా ఉంటుంద‌న్నారు.

స‌మ‌స్య‌ల‌పై అవ‌గాహ‌న లేని , ఎజెండాతో న‌డిచే చ‌ర్చ‌లు ప్ర‌జాస్వామ్యానికి హానిక‌రంగా మార‌తాయ‌న్నారు సీజేఐ. మీడియా ద్వారా ప్ర‌చారం చేస్తున్న ప‌క్ష‌పాత అభిప్రాయాలు ప్ర‌జ‌ల‌ను ప్ర‌భావితం చేస్తున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు

. మీ బాధ్య‌త‌ను అతిక్ర‌మించ‌డం ద్వారా ప్ర‌జాస్వామ్యాన్ని రెండ‌డుగులు వెన‌క్కి తీసుకు వెళుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Also Read : యూపీ స‌ర్కార్ అవినీతికి ప‌రాకాష్ట

Leave A Reply

Your Email Id will not be published!