CJI Suicide Comment : వ్యవస్థలో లోపం ఆత్మహత్యల పర్వం
సీజేఐ చంద్రచూడ్ సంచలన కామెంట్స్
CJI Suicide Comment : ఆధునిక టెక్నాలజీ మనుషులను దూరం చేస్తోంది. మానసికంగా ఇబ్బందులు పడేలా చేస్తోంది. ఈ తరుణంలో విద్యా వ్యవస్థలు ఇవాళ మార్కెట్ లో అమ్మే వస్తువులుగా మార్చేలా చేస్తున్నాయి విద్యార్థులను.
ఎప్పుడైతే విద్య వ్యాపారంగా మారిందో ఆనాటి నుంచి విద్యా వ్యవస్థ గాడి తప్పింది. గతి తప్పింది. భరోసా ఇవ్వలేని స్థితికి చేరుకుంది. వ్యాపారంలో లాభానికి ప్రయారిటీ ఎక్కువగా ఉంటుంది. కానీ ఇందులో విలువలు అంటూ ఉండవు. ఓ వైపు మతం డామినేట్ చేస్తోంది.
ఇంకో వైపు విజ్ఞానం ప్రశ్నార్థకంగా మారింది. జీవితంలో చదువు కీలకం. ప్రధానంగా విద్యార్థి దశ అత్యంత ముఖ్యం. ఇప్పటికే మన దేశానికి చెందిన విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా పేరొందారు. ఇదే సమయంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ఇది పక్కన పెడితే దేశంలో ఇంకా కుల వ్యవస్థ కొనసాగుతూ వస్తోంది. ఓ వైపు మతం ఇంకో వైపు కులం దూరం పెడుతోంది. ఈ జాడ్యం క్యాన్సర్ కంటే ఎక్కువగా విద్యా సంస్థల్లో, విశ్వ విద్యాలయాల్లోకి చేరింది. ఆ మధ్యన దళిత కులానికి చెందిన రోహిత్ వేముల ఇలాగే చని పోయాడు.
ఈ తరుణంలో ఇంకో విద్యార్థి కూడా సూసైడ్ కు పాల్పడ్డాడు. ఇలాంటి ఘటనలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. దీనిపై ప్రత్యేకంగా ప్రస్తావించారు భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి ధనంజయ వై చంద్రచూడ్. ఈ సందర్బంగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి ఆలోచించేలా చేశాయి.
ప్రధానంగా దళిత, ఆదివాసీ వర్గాలకు చెందిన చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఇదే క్రమంలో న్యాయమూర్తులు సామాజిక వాస్తవాల నుండి దూరంగా ఉండలేరని అన్నారు సీజేఐ(CJI Suicide Comment).
ప్రవేశ పరీక్ష మార్కుల ఆధారంగా హాస్టల్ గదులు కేటాయించడం, దళిత, ఆదివాసీ విద్యార్థులను కించ పరిచేలా బహిరంగంగా మార్కులు అడగడం , వారి ఇంగ్లీష్ ప్రావీణ్యాన్ని అపహాస్యం వంటి విధానాలకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. అణగారిన వర్గాల విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు పెరుగుతున్నాయని ఇందులో దళిత, ఆదివాసీ వర్గాల విద్యార్థులే ఎక్కువని పరిశోధనల్లో తేలిందన్నారు.
సానుభూతి లేక పోవడం వల్ల ఉత్పన్నమయ్యే వివక్షే ఇందుకు కారణమని సీజేఐ విచారం వ్యక్తం (CJI Suicide)చేశారు. ఈ 75 ఏళ్ల కాలంలో ప్రముఖ సంస్థలను ఏర్పాటు చేసుకున్నాం..కానీ ఇదే సమయంలో బాధితులకు అండగా నిలవాల్సిన, భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
జాతీయ న్యాయ విశ్వ విద్యాలయాలు ఈ వర్గాలకు ఎందుకు అందుబాటులో ఉండలేక పోయాయో ఆలోచించాలన్నారు. జస్టిస్ చంద్రచూడ్ చేసిన ఈ వ్యాఖ్యలు భారత దేశంలో కొనసాగుతున్న వివక్షకు అద్దం పడుతున్నాయి.
Also Read : కేసుల పెరగడం వ్యవస్థ తప్పు – రిజిజు