CJI vs Kiren Rijiju Comment : ‘సుప్రీం’ నువ్వా నేనా
కేంద్రం వర్సెస్ సీజేఐ
CJI vs Kiren Rijiju Comment : తమ మధ్య ఆధిపత్య పోరు ఏమీ లేదని పైకి చెబుతూ వస్తున్నా కేంద్రంలోని మోదీ సర్కార్ కు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ సారథ్యంలోని సుప్రీంకోర్టుకు మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉన్నది. దేశంలో వ్యవస్థలు ఎవరి చేతుల్లో ఉండాలనే దానిపై ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది.
కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు సంచలన కామెంట్స్ చేశారు. సుప్రీంకోర్టుకు(CJI vs Kiren Rijiju) సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూనే వస్తున్నారు. ఎన్నికల సంఘానికి సంబంధించిన ఎన్నికల కమిషనర్ల నియామకంపై ఇటీవల భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు షాకింగ్ కామెంట్స్ చేసింది.
కేంద్ర ఎన్నికల కమిషనర్ అయ్యా అనే స్థితిలో ఉండ కూడదని అవసరమైతే ప్రధాన మంత్రిని, రాష్ట్రపతిని ప్రశ్నించ గలిగేలా ఉండాలని స్పష్టం చేసింది. అంతే కాదు దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే ఏకైక వ్యవస్థ ఎన్నికల సంఘంపై ఉంటుందని గుర్తు చేస్తూనే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
ఇందుకు సంబంధించి ప్రధాన మంత్రి, సీజేఐతో పాటు ప్రతిపక్ష నాయకుడు కలిసి కేంద్ర ఎన్నికల కమిషనర్లను నియమించాలని తీర్పు చెప్పింది.
ఆ తీర్పు బీజేపీ ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. ఒక రకంగా కంట్లో నలుసులా, చెవిలో జోరీగ లాగా అనిపించింది. ఆనాటి నుంచి నేటి దాకా ప్రతి సందర్భంలోనూ సీజేఐ జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ మెట్టి కాయలు వేస్తూ వస్తున్నారు.
దేశంలో గవర్నర్ల వ్యవస్థపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్లకు రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు. అంతే కాదు రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతున్న సందర్బంలో ఎందుకు కాలు పెట్టాలని అనుకుంటున్నారంటూ మహారాష్ట్ర కేసులో వ్యాఖ్యానించారు.
అక్కడ పని చేసిన మాజీ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ వ్యవహారం అనుమానాస్పదంగా ఉందని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ అలసత్వం కారణంగా లక్ష్మణ రేఖను దాటాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
ఇదే సమయంలో తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు(CJI vs Kiren Rijiju Comment). కేంద్రానికి సుప్రీంకోర్టుకు మధ్య లక్ష్మణ రేఖ అనేది ఉంటుందని తెలుసు కోవాలని సూచించారు. అన్ని నియామకాలలో సీజేఐ లేదా న్యాయమూర్తులు ఉంటే ఇక న్యాయ వ్యవస్థ ఎలా ముందుకు వెళుతుందని ప్రశ్నించారు.
తామైనా లేదా న్యాయ వ్యవస్థ అయినా ఇద్దరికీ ఓ గీత గీసి ఉందని , అది రాజ్యాంగమే స్పష్టం చేసిందన్న విషయాన్ని గుర్తించాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం కిరెన్ రిజిజు చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
ఓ వైపు బాధ్యత, నిబద్దత కలిగిన సీజేఐకి కేంద్రంలో దూకుడుగా వ్యవహరిస్తున్న మోదీ సర్కార్ కు మధ్య ఆధిపత్య పోరుగా మారడం ఒకింత ఇబ్బందికరంగా మారిందన్న విమర్శలు లేక పోలేదు. రాజ్యాంగ బద్దమైన వ్యవస్థలు తమ పనులు చేసుకుంటూ పోతాయని కానీ చిక్కల్లా ఏమిటంటే ప్రభుత్వం అన్ని దాంట్లో వేలు పెట్టడం సరికాదంటూ పేర్కొన్నారు ఓ సందర్బంలో సీజేఐ.
ఏది ఏమైనా ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే స్వేచ్చ పూరితంగా ఎన్నికల సంఘం ఉండాలన్నది వాస్తవం.
Also Read : జై శంకర్..రాహుల్..థరూర్ వైరల్