IAS Sri Lakshmi : ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మికి క్లీన్ చిట్
హైకోర్టు ఊరట ఐఏఎస్ కు బాసట
IAS Sri Lakshmi : దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ పాలైన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మికి భారీ ఊరట లభించింది. మంగళవారం ఆమెకు తెలంగాణ హైకోర్టు ఖుష్ కబర్ చెప్పింది. ఈ మేరకు ఓఎంసీ కేసుకు సంబంధించి జరిగిన విచారణలో శ్రీలక్ష్మికి క్లీన్ చిట్ ఇచ్చింది.
ఆమెకు అందులో ఎలాంటి భాగం లేదని, అంతా సవ్యంగానే సాగిందని నమ్ముతున్నట్లు పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు ఆమెను నిర్దోషిగా ప్రకటించింది. ఈ మేరకు కేసు నుంచి శ్రీలక్ష్మిని(IAS Sri Lakshmi) తప్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది కోర్టు. ఒకానొక దశలో ఆమె డిప్రెషన్ కు లోనయ్యారు. తలెత్తు కోలేక పోయారు.
ఒక ఐఏఎస్ స్థానంలో ఉన్న శ్రీలక్ష్మిపై లెక్కలేనన్ని ఆరోపణలు వచ్చాయి. అంత లోనే ఎలా క్లీన్ చిట్ ఇచ్చిందనే దానిపై అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. ఇదిలా ఉండగా వైఎస్ హయాంలో ఒక వెలుగు వెలిగిన ఈ అధికారిణి ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయారు.
ఆ తర్వాత ఆయన తనయుడు ఏపీలో సీఎంగా కొలువు తీరాక తిరిగి శ్రీలక్ష్మికి ఛాన్స్ ఇచ్చారు. ఆపై మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చారు. రెండు రాష్ట్రాలు విడి పోవడంతో ఆమెకు ఏపీని కేటాయించారు. గతంలో ఓఎంసీ కేసుకు సంబంధించి ఏడాది పాటు జైలు శిక్ష కూడా అనుభవించారు.
2004-2009 ఏళ్ల మధ్య మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేశారు. ఓఎంసీకి గనుల కేటాయింపులో రూల్స్ కు విరుద్దంగా పని చేశారని విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం క్లీన్ చిట్ ఇవ్వడంతో శ్రీలక్ష్మికి జగన్ రెడ్డి కీలక పదవి అప్పగించే చాన్స్ లేక పోలేదని ప్రచారం జరుగుతోంది.
Also Read : మోదీ మోర్బీ ఘటనపై పశ్చాతపం ఏది