Arvind Kejriwal : అఖిలేష్ ను కలిసిన అరవింద్
ఆప్ పోరాటానికి ఎస్పీ మద్దతు
Arvind Kejriwal : ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ఉత్తర ప్రదేశ్ లోని లక్నోకు చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు సమాజ్ వాదీ పార్టీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్. ఈ సందర్బంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ , ఎంపీ సంజయ్ సింగ్ , ఢిల్లీ విద్యా శాఖ మంత్రి అతిషి కూడా ఉన్నారు. ఈ సందర్బంగా కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ మధ్య గంటకు పైగా సమావేశం జరిగింది. దేశంలో చోటు చేసుకున్న రాజకీయాలు, పరిణామాల గురించి చర్చించారు.
ప్రధానంగా ఢిల్లీ సర్కార్ కు వ్యతిరేకంగా కేంద్రం ఆర్డినెన్స్ తీసుకు వచ్చింది. తమకు సంబంధించిన అధికారాలను సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొన్నప్పటికీ వాటిని తుంగలో తొక్కుతూ చట్టం తీసుకు రావాలని యత్నిస్తోంది. కాగా చట్టంగా అమలు కావాలంటే లోక్ సభతో పాటు రాజ్య సభలో మూడొంతుల మెజారిటీ ఉండాలి. అప్పుడే పాస్ అవుతుంది. కాగా విచిత్రం ఏమిటంటే లోక్ సభలో బీజేపీకి బలం ఉంటే రాజ్య సభలో విపక్షాలకు బలం ఎక్కువగా ఉంది. ఏ ఒక్కటి కాక పోయినా ఆర్డినెన్స్ చట్టంగా మారదు.
దీంతో తెలివి మీరిన సీఎం కేజ్రీవాల్ విపక్షాలకు సంబంధించిన నేతలు, పార్టీ చీఫ్ లు, సీఎంలను కలుసుకున్నారు. ఇప్పటి వరకు ఆయనకు మద్దతు తెలిపిన వారిలో సీఎంలు మమతా బెనర్జీ, హేమంత్ సోరేన్ , నితీశ్ కుమార్ , ఎంకే స్టాలిన్ ఉన్నారు. తాజాగా ఎస్పీ చీఫ్ అఖిలేష్ కూడా కేజ్రీవాల్ కు సపోర్ట్ గా నిలిచారు.
Also Read : Sharad Pawar : దేశంలో బీజేపీకి ఎదురు గాలి – పవార్