Priyanka Gandhi : వ‌చ్చే ఎన్నిక‌ల‌పై ప్రియాంక ఫోక‌స్

ప్ర‌చారంలో ఆమెనే ముందంజ

Priyanka Gandhi: అంప‌శ‌య్య‌పై ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఉన్న‌ట్టుండి తిరిగి ఆక్సిజ‌న్ అందించారు ఆ పార్టీకి చెందిన మాజీ చీఫ్ రాహుల్ గాంధీ. ఆయ‌న చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర ఒక్క‌సారిగా కాంగ్రెస్ పార్టీకి బూస్ట్ ఇచ్చింది. ఇదే స‌మ‌యంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో గుజ‌రాత్ , యూపీలో కాంగ్రెస్ ఘోర ప‌రాజ‌యం పొందినా భార‌తీయ జ‌న‌తా పార్టీ కొలువు తీరిన హిమాచ‌ల్ ప్ర‌దేశ్ తో పాటు క‌ర్ణాట‌క‌లో అద్భుత విజ‌యాన్ని సాధించింది. ఈ కీల‌క విజ‌యంలో ఆ పార్టీకి చెందిన సోనియా కూతురు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) కీల‌క పాత్ర పోషించారు. అన్నీ తానై వ్య‌వ‌హ‌రించారు.

ఈ ఏడాది చివ‌ర‌లో మ‌రి కొన్ని రాష్ట్రాల‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వాటిలో కాంగ్రెస్ పార్టీ ప‌వ‌ర్ లో ఉన్న రాజ‌స్థాన్ తో పాటు మ‌ధ్య ప్ర‌దేశ్ , తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. వీటిపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టింది ప్రియాంక గాంధీ(Priyanka Gandhi). ఆమెనే సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా , ప్ర‌చార అస్త్రంగా ప్ర‌యోగించ‌నుంది పార్టీ. ఇందుకు సంబంధించి ఎక్కువ‌గా ఫోక‌స్ చేస్తూ వ‌స్తున్నారు. మ‌రోవైపు పార్టీ వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని క‌లిసి వ‌చ్చే పార్టీల‌తో క‌లుపుకుని పోవాల‌ని అనుకుంటోంది. ఈ మేర‌కు ఆ పార్టీని ఇత‌ర పార్టీల‌తో క‌లిపే ప‌నిని త‌న భుజాల మీద వేసుకున్నారు జేడీయూ చీఫ్ , బీహార్ సీఎం నితీశ్ కుమార్.

ఇక ప్రియాంక గాంధీ తో పాటు రాహుల్ గాంధీ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్ట‌డంలో, నిల‌దీయ‌డంలో ముందంజ‌లో ఉన్నారు. ప్ర‌స్తుతం రాహుల్ ఆరు రోజుల ప‌ర్య‌ట‌న‌లో అమెరికాలో కొలువు తీరారు. ఇక ప్రియాంకా గాంధీ తెలంగాణ‌పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్ట‌నున్న‌ట్లు స‌మాచారం. ఆమె ఖ‌మ్మం జిల్లా నుంచి లోక్ స‌భ ఎన్నిక‌ల బ‌రిలో దిగ‌నున్నట్లు టాక్. ఏది ఏమైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా స‌రే కాంగ్రెస్ జెండా ఎగుర వేయాల‌న్న‌ది ప్రియాంక గాంధీ కంక‌ణం క‌ట్టుకున్నారు. బీజేపీని త‌ట్టుకుని నిల‌బ‌డాలంటే మ‌రింత క‌స‌ర‌త్తు చేయాల్సి ఉంది కాంగ్రెస్. ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి.

Also Read : Arvind Kejriwal : అఖిలేష్ ను క‌లిసిన అరవింద్

Leave A Reply

Your Email Id will not be published!