CM YS Jagan : ఏపీలో షెడ్యూల్ ప్ర‌కార‌మే ఎన్నిక‌లు – జ‌గ‌న్

ముంద‌స్తు ఎన్నిక‌లు ఉత్తిదేన‌న్న సీఎం

CM YS Jagan : ఏపీ సీఎం , వైసీపీ చీఫ్ సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి(CM YS Jagan) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. గ‌త కొంత కాలంగా రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై కూడా స్ప‌ష్టత ఇవ్వాల‌ని పెద్ద ఎత్తున ఒత్తిడి కూడా పెరుగుతోంది జ‌గ‌న్ రెడ్డిపై.

ఇవాళ సీఎం ఆధ్వ‌ర్యంలో కీల‌క మంత్రి మండ‌లి స‌మావేశం జ‌రిగింది. కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు. మంత్రులకు, ఇత‌ర ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు ఫుల్ క్లారిటీ ఇచ్చారు జ‌గ‌న్ రెడ్డి. ఈ మేర‌కు రాష్ట్రంలో ముందస్తు ఎన్నిక‌లు ఉండ‌వ‌ని తేల్చి చెప్పారు. ఎవ‌రికి వాళ్లు త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌లో, ఇచ్చిన బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించాల‌ని స్ప‌ష్టం చేశారు సీఎం.

ఎట్టి ప‌రిస్థితుల్లో ముంద‌స్తు ఎన్నిక‌లంటూ ఉండ‌వు. ఎప్ప‌టి లాగే ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌కార‌మే జ‌రుగుతాయ‌ని ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. విపక్షాల మాయ మాట‌లు , సొల్లు క‌బుర్ల‌ను ఆస‌రాగా చేసుకుని విలువైన కాలాన్ని దుర్వినియోగం చేయొద్ద‌ని అన్నారు.

తాను ఇచ్చిన టార్గెట్ పూర్తి చేసేందుకు కృషి చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. లేక పోతే ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. రాష్ట్రంలో ఎక్క‌డా లేని రీతిలో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నామ‌ని అన్నారు. టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన ఇంకా వామ‌ప‌క్షాలు క‌లిసినా వైసీపీని ఎదుర్కొనే స‌త్తా, ద‌మ్ము లేద‌న్నారు. రాబోయే కాలం మ‌న‌దేన‌ని, అధికారం తిరిగి చేప‌ట్ట‌డం ఖాయ‌మ‌న్నారు జ‌గ‌న్ రెడ్డి.

Also Read : Priyanka Gandhi : వ‌చ్చే ఎన్నిక‌ల‌పై ప్రియాంక ఫోక‌స్

 

Leave A Reply

Your Email Id will not be published!