Arvind Kejriwal : ‘మణిపూర్..ఢిల్లీ’ లా అండ్ ఆర్డర్ కథేంటి
రాజ్ నాథ్ సింగ్ పై నిప్పులు చెరిగిన కేజ్రీవాల్
Arvind Kejriwal : పంజాబ్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. ఆయన చండీగఢ్ లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, వాటిని కంట్రోల్ చేయడంలో భగవంత్ మాన్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందంటూ బాంబు పేల్చారు. అంతే కాదు కాంగ్రెస్ పై నోరు పారేసుకున్నారు.
తమ సర్కార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజ్ నాథ్ సింగ్గ పై ఆప్ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఆ పార్టీ కన్వీనర్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిప్పులు చెరిగారు. ఆయన ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మణిపూర్ ఎవరి ఆధీనంలో ఉంది, ఢిల్లీ లా అండ్ ఆర్డర్ ఎవరి చేతుల్లో ఉందో రాజ్ నాథ్ సింగ్ కు తెలియదా అని ప్రశ్నించారు.
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోనే మణిపూర్ కొనసాగుతోంది. అక్కడ సీఎం నిద్ర పోతున్నారా అని నిలదీశారు. ఇప్పటి వరకు ఆ రాష్ట్రం కంట్రోల్ లోకి రాలేదన్నారు. ఇది మీ చేతకాని తనానికి , అస్తవ్యస్త పాలనకు నిదర్శనమని ఎద్దేవా చేశారు అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). వాస్తవాలు తెలుసు కోకుండా నోరు పారేసుకోవడం మీలాంటి సీనియర్ నాయకుడికి తగదని హితవు పలికారు సీఎం.
ఇక ఢిల్లీలో తమ ప్రభుత్వం ఉన్నప్పటికీ లా అండ్ ఆర్డర్ తమ చేతుల్లో లేదన్నారు. అది బీజేపీ సారథ్యంలోని కేంద్రం చేతుల్లో ఉంటుందని ఎక్కడ లేని రీతిలో హత్యలు, అత్యాచారాలకు కేరాఫ్ గా ఢిల్లీ మారిందన్నారు. ముందుకు దీనికి సమాధానం చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు రాజ్ నాథ్ సింగ్ ను.
Also Read : Raghav Chadha : రాజ్ నాథ్ పై రాఘవ్ చద్దా గరం
