Bhagwant Mann : 2373 మందికి అపాయింట్మెంట్ లెటర్స్
అందజేసిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్
Bhagwant Mann : పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత కొన్నేళ్లుగా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్దతిలో పని చేస్తున్న కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తున్నట్లు ప్రకటించారు.
తమ ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో పనులు చేసుకుంటూ వెళుతున్నామని చెప్పారు. విద్య, వైద్యం, ఉపాధికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నట్లు చెప్పారు.
తాజాగా రాష్ట్రంలోని ఆరోగ్యం, కుటంబ సంక్షేమం, వైద్య విద్య, పరిశోధన విభాగాల్లో పని చేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, వార్డు అటెండెంట్లకు బుధవారం సీఎం భగవంత్ మాన్(Bhagwant Mann) అపాయింట్మెంట్ (నియామక) లెటర్లు అందజేశారు.
సీఎం క్యాంపు కార్యక్రమంలో వీరికి ఇచ్చారు. వీరితో పాటు జల వనరుల శాఖలో పని చేస్తున్న ఎస్డీలు, పంప్ ఆపరేటర్ల పోస్టులకు సంబంధించి మొత్తం 2 వేల 373 మందికి ఈ నియామక పత్రాలు ఇచ్చారు సీఎం.
ఈ సందర్భంగా భగవంత్ మాన్ నియామక ఉత్తర్వులు అందుకున్న వారిని ఉద్దేశించి ప్రసంగించారు. చట్ట పరమైన సాంకేతిక కారణాల వల్ల మిత్తం రిక్రూట్ మెంట్ ప్రక్రియ నిలిచి పోకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ప్రభుత్వం విధి విధానాలను పూర్తి చేసేందుకు చిత్త శుద్దితో ఉందని స్పష్టం చేశారు భగవంత్ మాన్(Bhagwant Mann). కొంత కాలం పాటు నిరుద్యోగులు, ఉద్యోగార్థులు వేచి ఉండాలని సూచించారు.
నిరసనలు, ఆందోళనలు చేయడం వల్ల ఎలాంటి లాభం ఉండదన్నారు. తమ ప్రభుత్వం నిరుద్యోగులు లేకుండా ఉండేలా చేయడమే లక్ష్యంగా పని చేస్తోందని చెప్పారు సీఎం. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రతి పోస్టును భర్తీ చేస్తామన్నారు.
Also Read : రాజ్ ఠాక్రే జోలికి వస్తే అగ్నిగుండమే