Bhupesh Baghel : న‌డ్డా కామెంట్స్ సీఎం సీరియ‌స్

బీజేపీ చీఫ్ కు అంత సీన్ లేదు

Bhupesh Baghel : ఛ‌త్తీస్ గ‌ఢ్ సీఎం భూపేష్ బ‌ఘేల్ నిప్పులు చెరిగారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్ జేపీ న‌డ్డాపై మండిప‌డ్డారు. రాహుల్ గాంధీ పై నోరు పారేసు కోవ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. క‌ర్ణాట‌క‌లో ఫ‌లితాల త‌ర్వాత న‌డ్డా ఏం మాట్లాడుతున్నాడో త‌న‌కే తెలియ‌డం లేద‌ని ఎద్దేవా చేశారు. భూపేష్ బ‌ఘేల్(Bhupesh Baghel) మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ గురించి ఏం తెలుస‌ని అనుచిత వ్యాఖ్య‌లు చేశారంటూ ప్ర‌శ్నించారు న‌డ్డాను. త‌న‌ను బీజేపీ చీఫ్ గా ఎవ‌రు నియ‌మించారంటూ మండిప‌డ్డారు సీఎం.

ఇదిలా ఉండ‌గా బీజేపీ చీఫ్ జేపీ న‌డ్డా అమృత్ కాల్ కి ఒరే అనే పుస్త‌కాన్ని విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. ద్వేషం అనే షాపింగ్ మాల్ ను రాహుల్ గాంధీ ఓపెన్ చేశాడంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు న‌డ్డా. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ఇదే స‌మ‌యంలో తీవ్రంగా స్పందించారు ఛ‌త్తీస్ గ‌ఢ్ సీఎం.

కులం పేరుతో, మతం పేరుతో, విద్వేషాల పేరుతో మ‌నుషుల మ‌ధ్య విభేదాలు సృష్టిస్తూ రాజ‌కీయంగా ఓట్లు దండుకునే కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది బీజేపీ కాదా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు భూపేష్ బ‌ఘేల్. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని సూచించారు జేపీ న‌డ్డాకు. ద్వేషం త‌ప్ప బీజేపీకి ఇంకేమీ చేత కాద‌న్నారు. ఇవాళ వ‌న‌రుల‌ను ధ్వంసం చేసి కొంత మందికే క‌ట్ట‌బెడుతున్న మోదీకి , ఆ పార్టీకి రాహుల్ గాంధీని విమ‌ర్శించేంత అర్హ‌త లేద‌న్నారు.

Also Read : Arvind Kejriwal

Leave A Reply

Your Email Id will not be published!