CM Chandrababu : యూట్యూబ్ గ్లోబల్ సీఈఓ నీల్ మోహన్ ను కలిసిన బాబు

నీల్ మోహన్, సంజయ్ గుప్తాలతో కనెక్ట్ కావడం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు...

CM Chandrababu : యూట్యూబ్ గ్లోబల్ సీఈఓ నీల్‌మోహన్, గూగుల్ ఏపీఏసీ హెడ్ సంజయ్ గుప్తాలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు ఆన్‌లైన్‌లో సమావేశం అయ్యారు. ఈ భేటీలో పెట్టుబడులకు సంబంధించిన పలు కీలక అంశాలపై చంద్రబాబు చర్చించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.

CM Chandrababu Meet

నీల్ మోహన్, సంజయ్ గుప్తాలతో కనెక్ట్ కావడం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. కంటెంట్, స్కిల్ డెవలప్‌మెంట్, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లను ప్రోత్సహించడానికి స్థానిక భాగస్వాముల సహకారంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు చేయడం గురించి చర్చించినట్లు వివరించారు. రాజధాని అమరావతిలో మీడియా సిటీలో సాంకేతిక సహాయాన్ని అందించడానికి ఉన్న అవకాశాలను వారితో చర్చించినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.

Also Read : Minister S Jaishankar : బాంగ్లాదేశ్ పరిస్థితులపై రాజ్యసభలో ప్రస్తావించిన విదేశాంగ మంత్రి

Leave A Reply

Your Email Id will not be published!