CM Chandrababu : 3 రాజధానుల పేరుతో వైసీపీ ప్రభుత్వం ఏపీని నాశనం చేసింది

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ....

CM Chandrababu : 2019 తర్వాత మూడు రాజధానుల‌ పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీపీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాశనం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu) అన్నారు. ఐదేళ్ల వారి పాలనలో ఒక్క అభివృద్ధి ప్రాజెక్టూ నిర్మాణం జరగలేదని మండిపడ్డారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఆరు నెలలు గడిచిందని, ఈ సమయమంతా గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను సరి చేయడమే సరిపోయిందని చంద్రబాబు(CM Chandrababu) వెల్లడించారు. ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వంపై కుట్రలు చేస్తే అందులో ప్రజలు భాగస్వామ్యం కావొద్దని ఆయన చెప్పుకొచ్చారు. పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు.

CM Chandrababu Comment

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు(CM Chandrababu) మాట్లాడుతూ.. ” పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నాం. తెలుగు వారంతా గర్వంగా చెప్పుకునే రోజు నేడు. ఉమ్మడి మద్రాసు నుంచి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు సాగించిన మహత్తర పోరాటం మరువలేనిది. పొట్టి శ్రీరాములు త్యాగం వల్లే మనమంతా తెలుగు వాళ్లమని చెప్పుకుంటున్నాం. తెలుగు జాతి కోసం ఆయన ఆలోచన చేసి ప్రాణత్యాగం చేశారు. 58 రోజులు ఆమరణ దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ సాధించారు.

పొట్టి శ్రీరాములు నడయాడిన నేలను అన్ని విధాలా అభివృద్ధి చేశాం. కానీ 2019లో అధికారం చేపట్టిన వైసీపీ ఆ పనులను నిర్లక్ష్యం చేసింది. గత ఐదేళ్లల్లో పొట్టి శ్రీరాములు స్వగ్రామంలో అభివృద్ధి లేకుండా చేశారు. ఆ మహనీయుడి త్యాగాలతోపాటు, గత పాలకుల పాపాలూ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది నాయకులు దూరదృష్టితో ప్రజలకు ఎంతో మంచి చేశారు. మరి కొంతమంది తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని, దేశాన్ని నాశనం చేశారు. గత పాలకలు రూ.1.25 లక్షల కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపారు. మంచితోపాటు మనకి చెడు చేసిన వారినీ గుర్తుంచుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోకుంటే రాష్ట్రం మూడు ముక్కలే.

మూడురాజధానుల పేరుతో ఏపీని సర్వనాశనం చేశారు. వాళ్లు మాత్రం కోట్లు దోచుకున్నారు. రైతులకు ధాన్యం డబ్బులు ఇవ్వకుండా పారిపోయారు. వారు రైతులకు చెల్లించాల్సిన రూ.1,650 కోట్ల బాకీని మేము చెల్లించాం. వైసీపీ ప్రభుత్వం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై చాలా మంది నమ్మకం కోల్పోయారు. నమ్మకం పోయిన తర్వాత అప్పులు పుట్టని పరిస్థితి ఏర్పడింది. గత పాలకుల వల్ల ఇప్పుడు మన రాష్ట్రం వైపు ఎవరూ చూడటం లేదు. ఐదేళ్ల నిధులు ఒకేసారి డ్రా చేసిన ఘనులు గత పాలకులు. వారివి అన్నీ దొంగ బుద్దులే.. అన్నీ దొంగ నాటకాలే. ఇప్పుడు నిధులు వచ్చే మార్గం లేక కొత్త దారులు వెతుకుతున్నాం” అని చెప్పారు.

Also Read : B Tech Ravi : కడప వైఎస్ అవినాష్ రెడ్డి పై భగ్గుమన్న బీటెక్ రవి

Leave A Reply

Your Email Id will not be published!