CM KCR Convoy : భారీ కాన్వాయ్ తో కేసీఆర్ హ‌ల్ చ‌ల్

మ‌రాఠాలో రెండు రోజుల ప‌ర్య‌ట‌న

CM KCR Convoy : బీఆర్ఎస్ చీఫ్ , తెలంగాణ సీఎం కేసీఆర్ ఏది చేసినా అది ఓ సంచ‌ల‌న‌మే. ఆయ‌న మాట‌ల‌తో మంట‌లు పుట్టిస్తారు. ప‌లు భాష‌ల‌తో మెస్మ‌రైజ్ చేస్తారు. ఆపై ప్ర‌త్య‌ర్థులు కోలుకునే లోపు వారిని విస్తు పోయేలా చేస్తారు. అదీ కేసీఆర్(KCR) స్టైల్. ఆయ‌న ఆలోచ‌న‌లు ఎవ‌రికీ అంద‌వు. వ్యూహాలు ఎవ‌రికీ చిక్క‌వు. అంతేనా ఒక్క‌సారి ఫోక‌స్ పెట్టాడంటే ఇక ఎవ‌రైనా స‌రే జీ హుజూర్ అనాల్సిందే. ఇప్పుడు ఆయ‌న బీఆర్ఎస్ తో ప్రకంప‌న‌లు రేపుతున్నారు. దేశంలో మోదీ ఏమో కానీ సీఎం కేసీఆర్ నిత్యం నానుతోంది. మీడియాలో ప్ర‌ధాన శీర్షిక‌ల్లో టాప్ లో నిలుస్తున్నారు.

బీఆర్ఎస్ మ‌రాఠాలో ప్రకంప‌న‌లు సృష్టిస్తోంది. ఇప్ప‌టికే అక్క‌డ కొలువు తీరిన ప్ర‌ధాన పార్టీల‌కు గుబులు రేపేలా ప్లాన్ చేశారు. స‌భ‌లు, సమావేశాల‌తో హోరెత్తిస్తున్నారు. ఆపై చేరిక‌ల‌తో బీఆర్ఎస్ అక్క‌డ ప్రభంజ‌నం సృష్టిస్తోంది. ఇదిలా ఉండ‌గా ఆయ‌న రెండు రోజుల పాటు మ‌రాఠాలో ప‌ర్య‌టించేందుకు బ‌య‌లు దేరారు. షోలాపూర్ నుంచి పండ‌రీపురం వెళ‌తారు. మంగ‌ళ‌వారం అత్యంత ప్ర‌సిద్ది చెందిన‌, ప్రాముఖ్య‌త క‌లిగిన తుల్జా భ‌వానీ అమ్మ వారిని ద‌ర్శించుకుంటారు.

ఇదిలా ఉండ‌గా సినిమాల‌ను త‌ల‌ద‌న్నేలా ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 600 వాహ‌నాల భారీ కాన్వాయ్ తో సీఎం కేసీఆర్ బ‌య‌లు దేరి వెళ్లారు. ఇప్పుడు ఈ ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Also Read : KTR : అభివృద్దికి న‌మూనా తెలంగాణ – కేటీఆర్

 

Leave A Reply

Your Email Id will not be published!