KCR : త్వ‌ర‌లో రైత‌న్న‌ల‌కు ఖుష్ క‌బ‌ర్

పెన్ష‌న్ సౌక‌ర్యం క‌ల్పించేందుకు ప్లాన్

KCR  : సీఎం కేసీఆర్ దేశంలో నిరంత‌రం మారుమ్రోగుతున్న పేరు. అటు రాజ‌కీయాల్లోనే కాదు ఇటు వ్యూహాలు ప‌న్న‌డంలో, అసాధార‌ణ నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో త‌న‌కు తానే సాటి అని పేరు తెచ్చుకున్నారు.

మొద‌టి నుంచి ఉద్య‌మ‌కారుడు కావ‌డంతో ఆయ‌న‌కు ఈ ప్రాంతం ప‌ట్ల‌, ఈ ప్ర‌జ‌ల ప‌ట్ల అవ‌గాహ‌న ఉంది. దీంతో కేసీఆర్ కు ప్ర‌తి అంగుళం అంగుళం ఎక్క‌డ ఉందోన‌న్న విష‌యం ఠ‌క్కున చెప్పేస్తారు.

ఒక ర‌కంగా చెప్పాలంటే ఆయ‌న ఓ గూగ‌ల్ లాగానే స్పందిస్తారు. సెటైర్లు వేస్తారు. ఉన్న‌ట్టుండి నవ్విస్తారు. ఆపై విప‌క్షాల‌ను ఓ ఆట ఆడుకుంటారు. త‌న‌దైన తెలంగాణ యాస‌, బాస‌తో ఆలోచించేలా చేస్తారు కేసీఆర్(KCR ).

ఇదీ ఆయ‌న ఘ‌న‌త‌. ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా డోంట్ కేర్ అంటారు. చేస్తున్న ప‌ని ప‌ట్ల త్రిక‌ర‌ణ శుద్దిగా చేయ గ‌లిగితే అది పూర్తిగా స‌క్సెస్ అవుతుంద‌న్న‌ది కేసీఆర్ న‌మ్మ‌కం. ఇప్ప‌టికే ఆయ‌న ప్ర‌వేశ పెట్టిన కొన్ని ప‌థ‌కాలు దేశానికే ఆద‌ర్శంగా నిలిచాయి.

తాజాగా రాష్ట్రంలో ఉన్న‌టువంటి రైత‌న్న‌ల‌కు నెల నెలా పెన్ష‌న్ సౌక‌ర్యం క‌ల్పిస్తే ఎలా ఉంటుందోన‌ని ఆలోచిన్తున్న‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు సాధ్యా సాధ్యాల‌ను ప‌రిశీలించాల‌ని ఆదేశించిన‌ట్లు ప్ర‌చారం జోరందుకుంది.

త్వ‌ర‌లో ఎన్నిక‌లు రాబోతున్నాయి. వ‌చ్చే బ‌డ్జెట్ లో ఈ ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించేందుకు రెడీగా ఉన్న‌ట్లు టాక్. రైతు బంధు, రైతు బీమా ప‌థ‌కాల‌కు తోడు అన్న‌దాత‌ల కోసం పెన్ష‌న్ స్కీం అమ‌లు చేస్తే బావుంటుంద‌ని అనుకుంటున్న‌ట్లు తెలిసింది.

47 ఏళ్లు నిండిన ప్ర‌తి రైతుకు నెల నెలా రూ. 2016 రూపాయ‌లు పెన్స‌న్ గా ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం.

Also Read : ఏపీ విత్త‌న సంస్థ‌కు జాతీయ పుర‌స్కారం

Leave A Reply

Your Email Id will not be published!