YS Sharmila : మోసం చేయడంలో కేసీఆర్ నెంబర్ వన్
నిప్పులు చెరిగిన వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల
YS Sharmila : అమలుకు నోచుకోని హామీలు ఇవ్వడం, వాటిని నెరవేర్చక పోవడం సీఎం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల. ఈ దేశంలో జనం చెవుల్లో పూలు పెట్టడం, మోసం చేయడంలో నెంబర్ వన్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే ఆయన కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా షర్మిల(YS Sharmila) మరోసారి నిప్పులు చెరిగారు కేసీఆర్ పై. తెలంగాణ ఉద్యమం పేరుతో పవర్ లోకి వచ్చిన కేసీఆర్ ఆ తర్వాత మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాడని ఆరోపించారు.
పాలనా కాలం ఎనిమిదన్నర ఏళ్లవుతున్నా ఇప్పటి వరకు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు. ఏ ఒక్క ఎకరా పోడు భూమికి పట్టా ఇవ్వలేదని ఆరోపించారు షర్మిల. ఆరు నెలలలో ఇస్తామని చెప్పిన దొర ఆ తర్వాత ఇవ్వడం మరిచి పోయాడని పేర్కొన్నారు. గిరిజన బిడ్డలను కావాలనే మోసం చేశాడని ధ్వజమెత్తారు. మహిళలు, చిన్న పిల్లలని చూడకుండా కేసులు పెట్టి, జైళ్లలో పెట్టిన ఘనత కేసీఆర్ కు చెల్లిందన్నారు వైఎస్ షర్మిల.
అసెంబ్లీలో ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి అడవి బిడ్డలను అవమానకరంగా మాట్లాడారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆది వాసీలను ఎంతగా హింసిస్తే అధికారిని చంపి ఉంటారని నిలదీశారు వైఎస్ షర్మిల(YS Sharmila). ధరణి పేరుతో లక్షల ఎకరాలు మీరు దోచుకోలేదా అని ప్రశ్నించారు కేసీఆర్ ను. కబ్జాలకు పాల్పడడమే కాకుండా తెలంగాణ ఆస్తులను అమ్మే హక్కు మీకు ఎవరు ఇచ్చారంటూ నిలదీశారు.
Also Read : ఎంపీ మాగుంట కొడుకు అరెస్ట్