CM KCR : 16న కృష్ణ‌మ్మ చెంత‌న కేసీఆర్ పూజ‌లు

పాల‌మూరు - రంగారెడ్డి ఎత్తిపోత‌ల వెట్ ర‌న్ స్టార్ట్

CM KCR : హైద‌రాబాద్ – తెలంగాణ సీఎం కేసీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు సెప్టెంబ‌ర్ 16న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వెట్ రన్ ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. పెద్ద ఎత్తున పంపుల‌ను ఏర్పాటు చేశారు. పాల‌మూరు – రంగారెడ్డి ఎత్తిపోత‌ల‌కు స‌ర్కార్ డిజైన్ చేసింది. దీని నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొల‌గి పోయాయి. 2 కిలోమీట‌ర్ల దూరంలో నార్లాపూర్ రిజ‌ర్వాయ‌ర్ లోకి నీళ్ల‌ను ఎత్తి పోయ‌డం జ‌రుగుతుంది.

CM KCR Comments

ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ కృష్ణ‌మ్మ త‌ల్లికి ప్ర‌త్యేకంగా పూజ‌లు చేస్తార‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అనంత‌రం ఏర్పాటు చేసిన స‌భ‌లో ప్ర‌సంగిస్తారు కేసీఆర్(CM KCR). ఇప్ప‌టికే ఎన్నిక‌ల‌కు సంబంధించి 115 సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. ఇక ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్ట‌బోయే ఈ స‌భ‌కు ఉమ్మ‌డి పాల‌మూరు, రంగారెడ్డి జిల్లాల నుంచి వేలాది మంది త‌ర‌లి రానున్నారు.

ఎత్తిపోత‌ల ద్వారా వ‌చ్చే కృష్ణ‌మ్మ జలాల‌ను ఆయా గ్రామాల స‌ర్పంచ్ లు తీసుకు వెళ‌తారు. అభిషేకం చేయ‌నున్నారు. ద‌క్షిణ తెలంగాణ‌కు ఆరోజు శుభ‌దినం అని ఒక ర‌కంగా చెప్పాలంటే పండుగ గా అభివ‌ర్ణించారు కేసీఆర్.

ఇదే స‌మ‌యంలో సీఎం పిలుపునిచ్చారు ఇంజ‌నీర్ల‌కు. కాళేశ్వ‌రం ప్రాజెక్టును ఎలా పూర్తి చేశారో అదే స్పూర్తితో పాల‌మూరు – రంగారెడ్డి ఎత్తిపోత‌ల‌ను పూర్తి చేయాల‌ని అన్నారు.

Also Read : Sajjala Ramakrishna Reddy : బాబులో భ‌యం మొద‌లైంది

Leave A Reply

Your Email Id will not be published!