CM KCR : కేసీఆర్ ను తిట్టినోళ్లు తిరిగి వస్తున్నరు
చరిత్ర చెప్పిన సత్యం అంటున్న బీఆర్ఎస్
CM KCR : బీఆర్ఎస్ కీలక కామెంట్స్ చేసింది. నిన్నటి దాకా సీఎం కేసీఆర్ ను తిట్టిన వాళ్లంతా అడ్రస్ లేకుండా పోయారని, మరికొందరు తిరిగి స్వంత గూటికి వస్తున్నారంటూ ఆ పార్టీ పేర్కొంది. తిట్టిన వాళ్లంతా ఎక్కడున్నారో చూసు కోవాలని స్పష్టం చేసింది. ఆ విషయం ప్రజలందరికీ తెలుసుని పేర్కొంది బీఆర్ఎస్.
CM KCR Comments
కేసీఆర్ మీద ద్వేషంతో మాజీ మంత్రి తూళ్ల దేవేందర్ గౌడ్ నవ తెలంగాణ పార్టీ పెట్టిండని, నామ రూపాలు లేకుండా పోయాడని ఎద్దేవా చేసింది. ఇక నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ నగారా సమితి పేరుతో పార్టీ పెట్టినా ఫాయిదా లేకుండా పోయిందని పేర్కొంది బీఆర్ఎస్(BRS). ఎమ్మెల్యేగా గెలిపిస్తే మనోడు బీజేపీలోకి పోయిండు. ఆ తర్వాత ఎంపీగా పోటీ చేసి ఓడి పోయి..ఇప్పుడు కాంగ్రెస్ లో టికెట్ కోసం వేచి చూస్తున్నాడంటూ మండిపడింది.
కేసీఆర్ సహకారంతో జేఏసీ చైర్మన్ గా ఉన్న కోదండరాం రెడ్డి తెలంగాణ జన సమితి పెట్టిండు. అడ్రస్ లేకుండా పోయిండని పేర్కొంది. ఇక మాజీ ఎంపీ వివేక్ అధికారం కోసం ఎక్కని గడప లేదు మొక్కని మొక్కు లేదని ఎద్దేవా చేసింది బీఆర్ఎస్. ఇంటి పార్టీ పెట్టిన చెరుకు సుధాకర్ ఇంటి బాట పట్టిండని తెలిపింది.
చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న కేసీఆర్ మీద ద్వేషం కక్కుతుండు.. చివరకు తల తిక్క జర్నలిజం పేరుతో అక్కసు వెళ్లగక్కుతున్నాడని ఆరోపించింది బీఆర్ఎస్. ఏపూరి సోమన్న, రవీంద్ర నాయక్, ఎ. చంద్రశేఖర్ , స్వామి గౌడ్, రాములు నాయక్ , కపిలవాయి దిలీప్ కుమార్ , విజయశాంతి, దాసోజు శ్రవణ్ , ప్రతాప్ రెడ్డి, బొడిగె శోభ, రాణి రుద్రమ, ఏపీ జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్ అంతా కేసీఆర్ ను ద్వేషించిన వాళ్లేనని తెలిపింది బీఆర్ఎస్.
Also Read : Bhola Shankar Meher Ramesh : మెగా స్టార్ భోళా శంకర్ భళా