Bhola Shankar Meher Ramesh : మెగా స్టార్ భోళా శంక‌ర్ భ‌ళా

ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేష్

Bhola Shankar Meher Ramesh : మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి , త‌మ‌న్నా భాటియా క‌లిసి న‌టించిన భోళా శంక‌ర్ ఆగ‌స్టు 11న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఇందుకు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను పంచుకున్నాడు చిత్ర ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌హేష్‌(Meher Ramesh). గ‌తంలో చిరంజీవి న‌టించిన సినిమాల కంటే భిన్నంగా భోళా శంక‌ర్(Bhola Shankar) ఉంటుంద‌న్నారు. బుధ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న సంతోషాన్ని పంచుకున్నారు. ద‌ర్శ‌కుడి టేస్ట్ కు త‌గ్గ‌ట్టు మెగాస్టార్ న‌టిస్తార‌ని , ఆయ‌న‌తో క‌లిసి ప‌ని చేయ‌డం తన అదృష్టంగా భావిస్తున్న‌ట్లు తెలిపారు.

Bhola Shankar Meher Ramesh Experience

2015లో నాకు వేదాళం న‌చ్చింది. ఆ చిత్ర ద‌ర్శ‌కుడు శివ‌. క‌థ‌ను అద్భుతంగా తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశాడు. అది సూప‌ర్ డూప‌ర్ హిట్ . సోద‌రుడు, సోద‌రి మ‌ధ్య ఉండే బ‌ల‌మైన బంధం వెనుక ఉన్న క‌థేమిటో చూపించే ప్ర‌య‌త్నం చేశాడ‌న్నారు మెహ‌ర్ ర‌మేష్. మిలియ‌న్ల మందిని సినిమా చూసేలా ప్రేరేపించింద‌ని పేర్కొన్నారు.

2009లో న‌టుడు అజిత్ న‌టించిన బిల్లా చిత్రాన్ని డార్లింగ్ ప్ర‌భాస్ తో రీమేక్ చేశాన‌ని తెలిపారు మెహ‌ర్ ర‌మేష్. ఇదే త‌మిళ న‌టుడు యాక్ష‌న్ , ఎంట‌ర్ టైన‌ర్ గా న‌టించిన వేదాలంని మెగా స్టార్ చిరంజీవితో క‌లిసి భోళా శంక‌ర్ గా తెర మీద‌కు తీసుకు వ‌చ్చాన‌ని స్ప‌ష్టం చేశారు. మొత్తంగా భోళా శంక‌ర్ భ‌ళా అని పించేలా చేయ‌డం ఖాయ‌మ‌న్నారు.

Also Read : Nara Lokesh : త‌ల్లిని త‌రిమేసిన జ‌గ‌న్ 420

Leave A Reply

Your Email Id will not be published!