2027 మార్చి నాటికి ప‌ట్టాదారు పుస్త‌కాలు

ఇస్తామ‌ని ప్ర‌క‌టించిన సీఎం చంద్ర‌బాబు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. భూ వివాదాలను పరిష్కరించి వ‌చ్చే ఏడాది 2027 మార్చి నాటికి లోపం లేని పట్టాదారు పాస్‌బుక్‌లను జారీ చేస్తామని వెల్ల‌డించారు. భూ రికార్డుల సమస్యలను పరిష్కరించిన తర్వాత మిగిలిన 56 లక్షల పాస్‌బుక్‌లను జారీ చేస్తామని అన్నారు. పచ్చని కొబ్బరి తోటలు, పంటలు , గోదావరి నదితో అలరారుతున్న కోనసీమ ప్రాంతాన్ని ఈ మధ్య కాలంలోనే రెండోసారి సందర్శించడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు. ఈ ప్రాంత ప్రజలు నిజాయితీపరులని ఆయన కొనియాడారు. వర్షాభావం , ఎల్ నినో ప్రభావం ఉన్నప్పటికీ, కోనసీమ ప్రాంతం పచ్చదనంతో కళకళ లాడుతోందని ప్ర‌శంసించారు. ఈ సీజన్‌లో గోదావరి నది నుండి దాదాపు 1,000 టీఎంసీల నీరు సముద్రంలోకి వదిలి వేయబడింది అని ఆయన పేర్కొన్నారు.

అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని, అలాగే తాను స్వయంగా నెలకు నాలుగు సార్లు ప్రజలను కలుస్తున్న విషయాన్ని నాయుడు వివరించారు. ప్రజలకు న్యాయం చేకూర్చే విధానాలను రూపొందించడంలో యంత్రాంగం పాత్రను ఆయన నొక్కి చెప్పారు. నేను, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలిసి ఎన్డీయే గా ఏర్పడ్డాము. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి తాము అన్ని విధాలా కృషి చేస్తున్నామని చెప్పారు సీఎం. ప్రతి నెలా మొదటి రోజున పేదలకు సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేసే ‘పేద‌ల‌ సేవలో’, పేదల జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు పీ-4, ఏపీని చెత్త రహితంగా మార్చడానికి, వ్యర్థాల నుండి సంపదను సృష్టించడానికి, వలయాకార ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి మూడో శనివారం నాడు ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర’ వంటి కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రకటించారు.

నాలుగో శనివారం నాడు, ఆరోగ్య సంరక్షణను అందించడానికి , డిజిటల్ హెల్త్ కార్డులను జారీ చేయడానికి ప్రభుత్వం సంజీవిని కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు సీఎం. చిన్న కుటుంబాల కోసం తాను గతంలో చేసిన ప్రచారాన్ని పక్కనపెట్టి, జనాభా పెరుగుదలను సమర్థిస్తూ, పిల్లలే ఒక సంపద అని నాయుడు అన్నారు. దంపతులు ఎక్కువ మంది పిల్లలను కనాలని ఆయన పిలుపునిచ్చారు. భూ పునఃసర్వేలోని అవకతవకలపై గత వైఎస్సార్‌సీ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు.

Leave A Reply

Your Email Id will not be published!