పంజాబ్ ఎన్నికల కోసం అభ్యర్థుల తొలి జాబితా

ప్ర‌క‌టించిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రెసిడెంట్ కేజ్రీవాల్

చండీగ‌ఢ్ : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పంజాబ్ రాష్ట్రంలో మ‌రోసారి ప‌వ‌ర్ లోకి వ‌చ్చేందుకు దృష్టి సారించింది. ఈ మేర‌కు అన్ని పార్టీల కంటే ముందే 2027లో ఎన్నికల కోసం అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించింది. అంద‌రినీ విస్తు పోయేలా చేసింది. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఈ అభ్యర్థులను ఖరారు చేశారు. ప్ర‌స్తుతం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ శనివారం 40 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ధురి నియోజకవర్గం నుంచి బ‌రిలోకి దిగ‌నున్నారు. అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వాన్ కొట‌క్ పుర నుంచి , ప్రస్తుతం జైలులో ఉన్న మంత్రి సంజీవ్ అరోరా (లూధియానా వెస్ట్) ఉన్నారు. వీరితో పాటు కుల్దీప్ సింగ్ ధాలివాల్ (అజ్నాలా), బల్కర్ సింగ్ (కర్తార్‌పూర్), జై కిషన్ సింగ్ రౌరీ (గఢ్‌శంకర్), కుల్వంత్ సింగ్ (ఎస్.ఎ.ఎస్. నగర్) ,లాభ్ సింగ్ ఉగోకే (భదౌర్) వంటి మంత్రులు కూడా అభ్యర్థుల జాబితాలో చోటు దక్కించుకున్నారు.

అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో జరిగిన ఈ పీఏసీ సమావేశంలో ఈ అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. ఈ సమావేశానికి కేజ్రీవాల్‌తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, పంజాబ్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మనీష్ సిసోడియా, ఆర్థిక మంత్రి హర్పాల్ చీమా తో పాటు పీఏసీ సభ్యులు హాజరయ్యారు. పార్టీ ప్రకటించిన మరికొందరు అభ్యర్థులలో అమన్‌దీప్ కౌర్ అరోరా (మోగా), అమన్‌షేర్ సింగ్ ‘షేరీ కాల్సీ’ (బటాలా), ఇందర్‌బీర్ సింగ్ నిజ్జర్ (అమృత్‌సర్ సౌత్), హర్‌మీత్ సింగ్ సంధు (తరణ్ తరణ్), సర్వన్ సింగ్ ధున్ (ఖేమ్ కరణ్), ఇందర్‌జిత్ కౌర్ మాన్ (నకోదర్), కరంబీర్ సింగ్ ఘుమాన్ (దాసుయా) , జస్వీర్ సింగ్ రాజా గిల్ (ఉర్మార్) ఉన్నారు. అభ్యర్థుల ప్రకటన అనంతరం అరవింద్ కేజ్రీవాల్ ఎంపిక చేసిన అభ్య‌ర్థుల‌కు ముంద‌స్తుగా శుభాకాంక్ష‌లు తెలిపారు. వారి ఎంపికను ప్రజల నమ్మకాన్ని మరింత బలోపేతం చేసే బాధ్యతగా అభివర్ణించారు.

Leave A Reply

Your Email Id will not be published!