చంద్రబాబును విమర్శించే అర్హత జగన్ కు లేదు

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత కామెంట్స్

శ్రీసత్యసాయి జిల్లా : ప్రకృతి విపత్తుల సమయంలో రేయింబవళ్లు కష్టించి పనిచేసే సీఎం చంద్రబాబును ప్రజలు వరదల్లో మునిగి పోతుంటే ఐ మ్యాక్స్ థియేటర్ లో కూర్చొని ఎంజాయ్ చేసే జగన్ కు విమర్శించే అర్హత లేదని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత మండిపడ్డారు. సంక్షేమానికి, అభివృద్దికి సీఎం చంద్రబాబు బ్రాండ్ అంబాసిడరయితే, గుండాయిజానికి, రౌడీ యిజానికి కేరాఫ్ అడ్రాస్ గొడ్డలి పార్టీని విమర్శించారు. ట్రిపుల్ సర్కార్ తో స్థానిక సంస్థలు మరింత అభివృద్ధి చెందుతాయని, మున్సిపల్ ఓటర్లు తమ రెండు ఓట్లను కూటమి అభ్యర్థులకు వేయాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా రాష్ట్రంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని సీఎం చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారన్నారు. అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ నిధులను, పెన్షన్ల కోసం ఒక్కరోజే రూ.5,825 కోట్లను లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం అందజేసిందన్నారు. రైతులకు ఇచ్చిన వాగ్గానాన్ని నిలబెట్టుకుంటూ ఈ ఏడాది రెండో విడత అన్నదాత – పీఎం కిసాన్ నిధులను అందజేస్తున్నామన్నారు. రెండో విడతగా రూ.7 వేల చొప్పున్న రైతుల ఖాతాల్లో రూ.3,125.47 కోట్లను జమ చేశామన్నారు. ఇప్పటికే మొదటి విడతగా ఈ ఏడాది జూన్ లో రూ.7 వేల చొప్పున అన్నదాత బ్యాంకు ఖాతాల్లో వేశామన్నారు. తమది రైతు పక్షపాతి ప్రభుత్వమన్నారు.

తుఫాన్లు, వరదలు ముంచెత్తినప్పుడు ప్రజలను పట్టించుకోకుండా ఐ మ్యాక్స్ థియేటర్ ఎంజాయ్ చేసిన చరిత్ర జగన్ ది అని మంత్రి సవిత మండిపడ్డారు. ఆయన సీఎంగా ఉన్న సమయంలో హైపై సినిమా సెట్టింగ్ మాదిరిగా భారా వేదిక నిర్మించి అక్కడి నుంచి నీటి మునిగిన పంట భూములను పరిశీలించారన్నారు. అన్నమయ్య డ్యామ్ కొట్టికపోయిన సమయంలో 42 మంది మృత్యువాత పడ్డారని, వారిని కూడా పరామర్శించిన పాపాన పోలేదని మండిపడ్డారు. తుఫాన్లు, వరదల సమయంలో ప్రజలు, బాధితుల గురించి పరితపించే వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడన్నారు. గతంలో విజయవాడలో వరదలు వచ్చినప్పుడు అక్కడి కలెక్టరేట్ లో రాత్రి పగలు ఉండి…సహాయక చర్యలను పర్యవేక్షించారన్నారు. ఆర్నాబ్ తుఫాన్ రాకముందు నుంచే అధికారులను అప్రమత్తం చేసి, నష్టం తగ్గేలా కృషి చేశారన్నారు. ఇప్పటికే ఆర్నాబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు… బాధితులందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు. వరదలు, తుఫాన్ లో సహాయక కార్యక్రమాల గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదన్నారు. మోకాల్లోతు బురదలో, నీటిలో దిగి… రైతన్నకు అండగా నిలిచే చంద్రబాబును విమర్శించే అర్హత కూడా జగన్ కు లేదని మంత్రి సవిత మండిపడ్డారు.

Leave A Reply

Your Email Id will not be published!